రైతు భరోసా పై రైతులు సలహాలు సూచనలు ఇవ్వాలి....

జిల్లా సహకార ఆడిట్ అధికారి డిప్యూటీ రిజిష్టర్ పద్మ

Jul 2, 2024 - 18:26
Jul 2, 2024 - 19:47
 0  7
రైతు భరోసా పై రైతులు సలహాలు సూచనలు ఇవ్వాలి....

సాగు, కౌలు రైతులకు రైతు భరోసా వర్తింపజేయాలని ఏకగ్రీవ తీర్మానం.....

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు భరోసా పై పలు సూచనలు

 సలహాలు ఇవ్వాలని సూర్యాపేట జిల్లా సహకార సంఘం ఆడిట్ అధికారి పద్మ అన్నారు.

మునగాల  02 జులై 2024 తెలంగాణవార్త ప్రతినిధి :- మండలంలో తాడ్వాయి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లో రైతు భరోసా అమలు ‌చేయడం కోసం తాడ్వాయి సొసైటీ చైర్మన్ తొగరు సీతారాములు అధ్యక్షుతన మంగళవారం సంఘం పరిధిలో ఉన్న వివిధ గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా సహకార ఆడిట్ అధికారి, డిప్యూటీ రిజిస్ట్రార్ పద్మ పాల్గోన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఆలోచనలు రైతులకు వదిలేసిందని రైతుబంధును రైతు భరోసాగా మార్చిందని లోపాలు సవరణలు చేయడం కోసమే రైతుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తుందని ఆమె తెలిపారు. అదేవిధంగా పలువులు కౌలు రైతులు మాట్లాడుతూ రాళ్లు రప్పలు గుట్టలు వెంచర్లు ఇళ్ల స్థలాలు సాగులో లేని భూములకు రైతు భరోసా ఇవ్వద్దని సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించింది. సాగు చేసే ప్రతి ఎకరాకు రైతు భరోసా వర్తింపజేయాలని అదేవిధంగా కౌలు రైతులకు తప్పనిసరిగా రైతు భరోసా కల్పిస్తూ వారికి రైతు గుర్తింపు కార్డులు ఇవ్వాలని పలువురు రైతులు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి కొల్లిశెట్టి బుచ్చి పాపయ్య, మాజీ జడ్పిటిసి సభ్యులు కొల ఉపేందర్ రావు, రైతు సంఘం నాయకులు బుర్రి శ్రీరాములు, సొసైటీ డైరెక్టర్ లు గట్టు ఉపేందర్, మాతంగి సైదమ్మ, సుంకర పిచ్చయ్య, మారం సుధాకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, రైతులు వేనేపల్లి వీరబాబు, లక్య నాయక్ రైతు సంఘం నాయకులు సైదా వీరబోయి ఎంకన్న,చిర్రా శీను,గోళ్ళపూడి శీను, భూక్యా బిక్షం, కోండమీది గుర్వయ్య, కారింగుల వీరయ్య, సిఇవో నాగేందర్, కోటయ్య, పలువురు రైతులు సోసైటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

A Sreenu Munagala Mandal Reporter Suryapet District Telangana State