సొంత నిధులతో సిసి రోడ్డు వేయించిన సర్పంచ్

Jan 4, 2026 - 21:18
 0  282
సొంత నిధులతో సిసి రోడ్డు వేయించిన సర్పంచ్

తిరుమలగిరి 05 జనవరి 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  తిరుమలగిరి మండలం పరిధిలోని మొండి చింత తండా గ్రామ పంచాయతీ లో సర్పంచ్ శ్రీలత బాలాజీ నాయక్ ను ఏకగ్రీవం గా ఎన్నుకున్న సందర్భంగా లావుడ్య శ్రీలత బాలాజీ నాయక్ ఇచ్చిన విరాళం డబ్బులతో దాదాపు 800 మీటర్లు పొడవున ఎస్సారెస్పీ కెనాల్ బ్రిడ్జి నుండి ఇస్లావత్ తండ వరకు సిసి రోడ్డు ప్రారంభించారు  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నరేష్ , వర్కింగ్ ప్రెసిడెంట్ జమ్మిలాల్ , మాజీ సర్పంచ్ లావుడ్య మోహన్ బాబు, జలాలపురం సర్పంచ్ బెట్టం గనేశ్వరి రాజు, మరియు వార్డు మెంబర్ కండ్య, రఘు, వెంకన్న, మహేష్ బాబు, బుచ్చ,వినోద, సజ్జన్, కిషన్, గోపి, రంగమ్మ, భీముడు వేముల శ్రీనివాస్, రాఘవులు, తదితరులు పాల్గొనారు, విరాళం డబ్బులతో సిసి రోడ్ పోయడం తాండవాసులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇది చాలా ఆదర్శవంతమైన పని అని అన్నారు

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి