రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

Aug 24, 2024 - 17:30
Aug 24, 2024 - 17:31
 0  2
రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్: రోడ్డు భద్రతపై ప్రజలకు అవర్నెస్ కార్యక్రమాలు నిర్వహించాలని, విద్యాసంస్థల్లోనూ అవగాహన సదస్సులు చేపట్టాలని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులకు సూచించారు.అన్ని శాఖల అధికారులు రోడ్డు ప్రమాదాల నివారణకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. సచివాలయంలో శుక్రవారం రహదారి భద్రత-సుప్రీంకోర్టు కమిటీ తీసుకున్న నిర్ణయాల అమలుపై కమిషనర్ ఇలాంబరితి ఆధ్వక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. రవాణాశాఖ, ట్రాఫిక్, ఆరోగ్య, వైద్య, కుటుంబ సంక్షేమం,నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా, రోడ్లుభవనాలశాఖ,జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, హెచ్‌ఎండీఏ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బ్లాక్ స్పాట్స్, అత్యవసర సేవలు, రోడ్డు భద్రతా చట్టాల అమలు, ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమాలు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, రోడ్డు ప్రమాదాలు,రెగ్యులర్ డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాలు, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్, అధికారుల సమన్వయం అనే అంశాలపై సుధీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2023లో రాష్ట్రంలో 22,903 ప్రమాదాలు జరిగాయని, వాటిలో 7,186 ప్రాణాంతక ప్రమాదాలు, 2,476 తీవ్ర గాయాలు, 10,404 చిన్న గాయాలు, 2,747 సాధారణ గాయాలు అయ్యాయని, వాటిని ఈ ఏడాది ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని శాఖల సమన్వయంతోనే ప్రమాదాల నివారణ సాధ్యమన్నారు. ప్రతి జిల్లాలో బ్లాక్ స్పాట్స్ ను గుర్తించామని, అక్కడ ప్రమాదాలు జరుగకుండా సమగ్ర ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిపారు. కమిషనర్ ఇలాంబరితి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల్లో అంబులెన్స్, అధికారుల మధ్య సమన్వయంతోనే ప్రమాదాల్లో మరణాలను తగ్గించవచ్చన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్ మరియు రాంగ్ సైడ్ డ్రైవింగ్ వంటి తీవ్రమైన రహదారి భద్రతా నేరాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

 
ఇంటర్మీడియట్ విద్యార్థులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, అదే విధంగా చిన్న వయస్సు నుంచే రహదారి భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. జాతీయ రహదారులపై పాదచారులు నడిచేందుకు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మిస్తే రద్దీగా ఉండే ప్రమాదాలని తగ్గించవచ్చని పలువురు అధికారులు పేర్కొన్నారు. ప్రతి నెల జిల్లాల్లో రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాలు భాగస్వామ్యంతో నిర్వహించాలని, రవాణా, పోలీసు, ఆర్‌అండ్‌బీ, జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ విభాగాలు ప్రతినెలా జిల్లా రహదారి పురోగతిని సమీక్షించాలని సూచించారు. అడిషనల్ సీపీ విశ్వప్రసాద్, డీసీపీ ట్రాఫిక్ రాహుల్ హెగ్డే, జోయల్ డేవిస్, ఈఎన్సీ మోహన్ నాయక్, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ స్నేహ శభరీస్, జేటీసీ రమేష్, మమతా ప్రసాద్, డీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333