ప్రధానోపాధ్యాయులను నిందించడం సరికాదు 

ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు ఎం పర్వత రెడ్డి

Nov 30, 2024 - 18:30
 0  8
ప్రధానోపాధ్యాయులను నిందించడం సరికాదు 

జోగులాంబ గద్వాల 30 నవంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల ఈరోజు ఎస్టియుటిఎస్ జోగులాంబ గద్వాల జిల్లా శాఖ కౌన్సిల్ సమావేశం గద్వాల పట్టణంలోని ప్రభుత్వ బాలికలు ఉన్నత పాఠశాల నందు జిల్లా అధ్యక్షులు ఎండి  యూనుస్   పాషా అధ్యక్షతన జరిగింది. ఇట్టి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు పర్వత్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజనానికి ప్రత్యేక కమిటీ వేయాలని ప్రధానోపాధ్యాయులను, ఉపాధ్యాయులను,  బాధ్యులను చేయడం సరికాదని  ఉపాధ్యాయులను కేవలం బోధనకే పరిమితం చేయాలని కోరారు. జీవో 317 కారణంగా స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేసి వారి సొంత జిల్లాలకు పంపాలన్నారు. పెండింగ్ బిల్లులు, డి ఏ లు మొత్తం  వెంటనే క్లియర్ చేయాలని, పూర్తిస్థాయిలో ఉపయోగపడే హెల్త్ కార్డ్స్ ను ఇవ్వాలన్నారు. 65% ఫిట్మెంట్ తో పిఆర్సీను అమలు చేయాలని, సిపిఎస్ ను రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలన్నారు. అలాగే 24 సంవత్సరాలు సర్వీసు పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులకు ఎఫ్ఆర్ 22 బిను వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ జి టి ఉపాధ్యాయులకు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఓటు హక్కును కల్పించాలి.ఈ సమావేశం నందు జిల్లా ప్రధాన కార్యదర్శి పులిపాటి లక్ష్మణ్ రాష్ట్ర కార్యదర్శి చెన్నకేశవులు రాష్ట్ర సాంస్కృతిక విభాగం కన్వీనర్ గౌరీ శంకర్ మరియు జిల్లా మండలాల బాధ్యులు కృష్ణయ్య, కిషోర్ చంద్ర, భీమన్న, సురేందర్రావు, రాజన్న, శ్రీహరి, వెంకటేష్, కిషోర్, రామస్వామి, అనిరుద్, మహమూద్, విజయభాస్కర్, నరసింహులు, శివ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333