సేవలలో బేస్ జవ్వాది కుటుంబం

Mar 31, 2025 - 20:07
Mar 31, 2025 - 20:14
 0  11
సేవలలో బేస్ జవ్వాది కుటుంబం

గిరిజన విద్యార్దులకు వీరు అందిస్తున్న సహకారం మరువలేనిది

దాతల వితరణకు సార్దకత చూపండి

చర్ల, మార్చి 31 : చర్లకు చెందిన జవ్వాది కుటుంబం సేవాకార్యక్రమాలలో ముందుంటూ పేదలకు సహకారమందించడం అబినందనీయమని విశ్రాంత ప్రభుత్వ ప్రదానోపాద్యాయులు, వనవాసీ కళ్యాణ పరిషత్ గౌరవ సలహాదారులు బివిఎస్ఎల్ నర్సింహారావు అన్నారు. ఉగాది పర్వదినం పుర్కస్కరించుకొని జవ్వాది కుటుంబ సభ్యుడు, హైదరాబాద్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న జవ్వాది ప్రశాంత్ అతని స్నేహితులు కడారి ముని యుగందర్, త్రిపురాన నాగరాజు, బొడ్డుచర్ల శ్రీనివాస కార్తీక్, వల్లోజు బాగ్యయ్య, సూరి ఆదిత్య కుమార్ ల సహకారంతో వనవాసీ విద్యార్దులకు 30 ట్రంకు పెట్టెలను వితరణగా అందచేసారు. ఈ సందర్భంగా వనవాసీ ప్రఖండ ప్రముఖ్ గొంది శోభన్ బాబు అద్యక్షతన జరిగిన కార్యక్రమంలో బివిఎస్ఎల్ మాట్లాడారు. వనవాసీ కళ్యాణ పరిషత్ అనుసరిస్తున్న ధర్మం, సేవాకార్యక్రమాల పట్ల ఆకర్షితులై అనేక వితరణలను అందచేస్తూ సంస్దలో కీలక భూమిక పోషించడం గర్వకారణమని అన్నారు. గిరిజన పేద విద్యార్దులపై అబిమానంతో ఆ కుటుంబం ఇప్పటికే రూ. 30 లక్షల భూమిని వితరణగా అందించడంతో పాటు బియ్యం, పరుపులు, పాదరక్షలు, భోజన ఏర్పాట్లు చేసిన విషయాన్ని గుర్తుచేసారు. ఆదివాసీ మహిళలపై ప్రేమాభిమానాలతో చర్లలో ఎవరూ చేయనివిదంగా 35 మంది గర్బిణి మహిళలకు సీమంతం చేసి వారిని గౌరవించుకున్న తీరు అందించినందనీయని అన్నారు. గోదావరి వరదల సమయంలోనూ వరద బాదిత కుటుంబాలకు రూ. 80 వేల విలువచేసే వంట పాత్రలను అందచేసారన్నారు. అనేక మంది పేద విద్యార్దులకు, క్రీడాకారులకు ఆర్దిక సహాయం అందించిన వీరిని ఆదర్శంగా తీసుకొని మరింతమంది ముందుకు వచ్చి సంస్దకు సహకరించాలని విజ్ఞప్తి చేసారు. ఇటువంటి అనేక మంది దాతల సహకారంతో తెలంగాణా రాష్ట్రంలోని అన్ని వనవాసీ విద్యార్ది నిలయాల కంటే చర్లలోని వనవాసీ విద్యార్ది నిలయం స్వయం ప్రతిపత్తితో నడుస్తుందన్నారు. కమిటి సభ్యులు శక్తి సామర్ద్యాల కారణంగానే ఈ ఘణత దక్కించుకుందని ప్రశంసించారు. ప్రభుత్వ ఉపాద్యాయులు, జవ్వాది కుటుంబ సభ్యుడు నరేంద్రబాబు మాట్లాడుతూ విద్యపై తమకు గల మక్కువతో ఇటువంటి సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. చదువుకొని అభివృద్దిలోకి వస్తే మీకుటుంబాలు ఆర్దికంగా నిలదొక్కుకుంటాయని అన్నారు. ప్రతి విద్యార్ది చదువుపై దృష్టి సారించి ఉన్నత స్దితికి చేరుకోవాలని ఆకాంక్షించారు. వనవాసీ జిల్లా సంఘటనా కార్యదర్శి కోరం సూర్యనారాయణ మాట్లాడుతూ ఆదివాసీలు, విద్యార్దులపై జవ్వాది కుటుంబంకు గల ప్రేమాభిమానాలకు కొదవలేదని అన్నారు. ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాల ద్వారా వీరు ఆదివాసీ విద్యార్దులకు సహకారమందించడం హర్షనీయమన్నారు. వనవాసీ సంస్దకు ప్రభుత్వం నుండి కాని కార్పోరేట్ శక్తుల నుండి కాని నిదులు రావని స్పష్టం చేసారు. సంస్ద దాతల సహకారంతో స్వయం ప్రతిపత్తితో నడుస్తుందన్నారు. పేద విద్యార్దల ఉన్నతికి మరింత మంది దాతలు ముందుకురావాలని పిలుపునిచ్చారు. వనవాసీ చర్ల మండల కార్యదర్శి మల్లాది సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ దాతలు అందచేదిన వితరణలను సద్వినియోగ పరుచుకొని ప్రతి ఒక్కరూ శ్రద్దగా చదివి ఉన్నత స్దితికి చేరుకోవాలన్నారు. అప్పుడే దాతల వితరణకు సార్దకత ఉంటుందన్నారు. విద్యార్దులు ధర్మానుగుణంగా మంచి నడవడికతో ఉంటు ఇటువంటి ఇటువంటి దాతలు సహకరిస్తారని పేర్కొన్నారు. కార్యక్రమంలో జవ్వాది కుటుంబ సభ్యులు జవ్వాది మురళీకృష్ణ, జవ్వాది శ్రీనివాసరావు, పామర్తి కౌషిక్, నిలయ కమిటీ సభ్యులు గోగికార్ రాంలక్ష్మణ్, వేములపల్లి ప్రవీణ్ బాబు, గొంది ప్రసన్న, పోలిన రమాదేవి, పాశికంటి శ్రీదేవి, శివరాజుల కిషోర్, రాజేష్ కుమార్ పాల్గొన్నారు.