సైబర్ మోసాల గురించి అవగాహన కలిగి ఉండాలి.

Mar 31, 2025 - 23:45
Mar 31, 2025 - 23:52
 0  40
సైబర్ మోసాల గురించి అవగాహన కలిగి ఉండాలి.

సైబర్ మోసాల గురించి అవగాహన కలిగి ఉండాలి.

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు రావడం, ఉచితంగా బహుమతులు రావడం, మన ప్రమేయం లేకుండా ఏదైనా వస్తుంది అంటే దాని వెనుక సైబర్ మోసగాళ్ళు ఉన్నారు అని గ్రహించాలి.

 ఏ బ్యాంక్ ఉద్యోగి ఖాతాదారునికి ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు అడగరు.

- తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయి అని అపరిచితులు చెప్పితే నమ్మవద్దు.

- మెస్సేజ్ లు, బ్లూ లింక్ లు అనుసరించి డబ్బు పెట్టుబడులు పెట్టవద్దు.

- సైబర్ మోసాలకు గురికాకుండా స్వీయ జాగ్రత్తలు పాటించాలి.

- అప్రమత్తత, అవగాహన చాలా ముఖ్యం.

K నరసింహ ఎస్పి సూర్యాపేట జిల్లా.

సూర్యాపేట, 31 మార్చి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- అప్రమత్తత, అవగాహన ద్వారా సైబర్ నేరాలను అరికట్టవచ్చు, భయమే పెట్టుబడిగా సాగుతున్న సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయడానికి సైబర్ మోసాలపై అవగాహన పెంచుకోవాలని జిల్లా ఎస్పి నరసింహ తెలిపినారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయారా? మీ డబ్బును పోగొట్టుకున్నారా? అయితే వెంటనే టోల్ ఫ్రీ నంబర్1930 కు ఫోన్ చేసి పిర్యాదు చేయాలని కోరారు. ఏ బ్యాంక్ ఉద్యోగి కూడా ఖాతాదారునికి ఫోన్ చేసి వ్యక్తిగత వివరాలు, ATM, PIN, OTP లాంటి వివరాలు అడగరు అన్నారు. తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు వస్తాయి అని అపరిచితులు చెప్పితే నమ్మవద్దు, ఫోన్ కు, మెయిల్ కు, సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సప్, ఇన్స్టాగ్రాం లాంటి మాధ్యమాలలో వచ్చే మెస్సేజ్ లు, బ్లూ లింక్ లు అనుసరించి డబ్బు పెట్టుబడులు పెట్టవద్దు. బహుమతులు వచ్చాయి, తక్కువ వడ్డీకి లోన్ అందుబాటులో, తక్కువ రేటుకు వస్తువులు వాహనాలు ఉన్నాయి, మంచి ఉద్యోగాలు ఉన్నాయి అని చెప్పి ప్రాసెసింగ్, రిజిస్ట్రేషన్ కు ఫీజు కట్టాలి అని చెప్పితే నమ్మి డబ్బులు చెల్లించవద్దు అని కోరారు. మీ పిల్లలు డ్రగ్స్ కేసులో, అక్రమ రవాణా కేసుల్లో లాంటి వాటిల్లో ఇరుకున్నరు కేసుల నుండి తప్పిస్తాం అంటూ ACB, కస్టమ్స్, సీఐడీ, CBI నుండి పోలీసు అధికారులం మాట్లాడుతున్నాం అని బెదిరిస్తారు పోలీసులు అని నమ్మి భయపడి డబ్బులు చెల్లించవద్దని అన్నారు. ఇలాంటి వాటి వెనుక సైబర్ మోసగాళ్ళు ఉంటారు అని గుర్తించాలి.

జిల్లా ప్రజలు సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ మోసాలపై అవగాహన కలిగి ఉండాలి, అప్రమత్తత, అవగాహన ద్వారానే సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయవచ్చని, సైబర్ నేరం జరిగిన మొదటి గంటలోనే (గోల్డెన్ అవర్) ఫిర్యాదు చేయడం ద్వారా స్కామర్ అకౌంట్ను ఫ్రీజ్ చేసి పోయిన డబ్బు రికవరీ సులభతరమవుతుందని తెలిపారు. సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోయారా? మీ డబ్బును పోగొట్టుకున్నారా? అయితే వెంటనే Dial1930కు కాల్ చేయాలని cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదును నమోదు చేస్తే మీ డబ్బును తిరిగి పొందే ఆస్కారం ఉంటుందన్నారు. 

సైబర్ నేరాలకు గురికాకుండా ఉండాలంటే...

1. లోన్ యాప్లకు దూరంగా ఉండాలి.

2. కస్టమర్ కేర్ నంబర్లను గూగుల్లో వెతకవద్దు. ఆయా సంస్థల అధికారిక వెబ్సైట్ నుంచి మాత్రమే కస్టమర్ కేర్ నంబర్లను పొందాలి.

3. అపరిచిత నంబర్ల నుంచి ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా వచ్చే వీడియో కాల్స్ ను స్పందించవద్దు.

4. లాటరీ ఆఫర్లంటూ వచ్చే మెసేజ్ ను నమ్మవద్దు.

5. అన్ వెరిఫైడ్ యాప్స్, వెబ్ సైట్స్ అందించే ప్రకటనలు నమ్మవద్దు. వారిచ్చే మోసపూరిత ఆఫర్లకు స్పందించి మోసపోవద్దు.

6. OLX లాంటి వాటిల్లో ఆర్మీ సోల్డర్లం, ఆఫీసర్లం అంటూ ఎవరైన సంప్రదిస్తే నమ్మి మోసపోవద్దు.

7. ఈజీ రిటర్న్స్, కమిషన్ బేస్డ్ సైట్లలో పెట్టుబడి పెట్టవద్దు.

8. పాస్వర్డ్, ఓటీపీ వివరాలను ఎట్టిపరిస్థితుల్లో ఎవరికీ షేర్ చేయవద్దు.

9. బ్యాంక్ లో వ్యక్తిగత వివరాలు నమోదు చేస్తాం అంటే ఎవ్వరికీ ఆధార్, బ్యాంక్ ఖాతా, ATM, OTP లాంటివి చెప్పవద్దు.

కొన్ని సైబర్ మోసాలు..

1) గరిడేపల్లి మండలానికి చెందిన ఒక వ్యక్తికి ముంబై సిబిఐ అధికారులం అంటూ ఫోన్ చేసి మీరు అమ్మాయిల అక్రమ రవాణాకు సంబంధించి కేసులో ఇరుక్కున్నారు ఆధారాలు మా వద్ద ఉన్నాయి డబ్బులు కడితే కేసు నుండి తప్పిస్తామని బ్లాక్ మెయిల్ చేసి సుమారుగా 18 లక్షల రూపాయలని అతని నుండి వసూలు చేశారు.

2) కోదాడకు చెందిన ఒక వ్యక్తికి ఫోన్ చేసి మీకు లాటరీ వచ్చినది, మీ బ్యాంకు నందు వ్యక్తిగత వివరాలు సరిగా లేవు, వివరాలు నమోదు చేయాలి ఆధార్ నంబర్ OTP నంబర్ చెపితే నమోదు చేస్తాం అంటే నమ్మి వివరాలు చెప్పగా సైబర్ మోసగాళ్ళు 1 లక్ష రూపాయలు అకౌంట్ నుండి బదిలీ చేసుకున్నారు.

3) అర్వపల్లి కి చెందిన ఒక వ్యక్తి భారత్ గ్యాస్ డీలర్ షిప్ గురించి ఆన్లైన్ నందు సెర్చ్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఫోన్ చేసి మేము భారత్ ఆయిల్ కంపెనీ నుండి మాట్లాడుతున్నాను, మీకు డీలర్ షిప్ ఇస్తాము సర్వీస్ ఛార్జ్ అవుతుంది అంటే డబ్బు పంపుతాడు. మళ్ళీ కాల్ చేసి రిజిస్ట్రేషన్, డీలర్ షిప్ DD కట్టాలి డబ్బులు పంపాలి అంటే అనుమాన వచ్చి అకౌంట్ చెక్ చేసుకుంటే 39 వేల రూపాయలు పోయినట్లు గుర్తించి బాధితుడు సైబర్ సెక్యూరిటీ సెల్ కు పిర్యాదు చేశారు.

4) మఠంపల్లికి చెందిన ఒక వ్యక్తికి ఇంస్టాగ్రామ్ ద్వారా లింక్ పంపించి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటూ నమ్మించి వ్యక్తిగత వివరాలు తీసుకొని ప్రాసెసింగ్ కోసం, రిజిస్ట్రేషన్ డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని అంటే డబ్బులు చెల్లిస్తారు. సంస్థ నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గుర్తించి పిర్యాదు చేశారు.

5) ఆత్మకూర్ ఎస్ మండలానికి చెందిన ఒక యువకునికి సైబర్ మోసగాళ్లు ఫోన్ చేసి మీకు ధని యాప్ ద్వారా 5 లక్షల రూపాయల లోన్ శాంక్షన్ ఐనది ప్రాసెసింగ్ కోసం డబ్బులు అడగగా 10 వేలు పంపించాడు, మళ్ళీ డబ్బులు అడగగా మోసపోయినట్లు గుర్తించాడు.

6) ముందుగా సోషల్ మీడియా అకౌంట్ ద్వారా బంధుత్వం తెలుసుకొని సూర్యాపేట టౌన్ కు ఒక వ్యక్తికి ఫోన్ చేసి మామయ్య నేను ఫలానా వ్యక్తిని మాట్లాడుతున్నాను తమ్ముడికి యాక్సిడెంట్ అయినది అర్జెంటుగా డబ్బులు కావాలి హాస్పటల్లో కట్టాల్సి ఉంది అంటూ తోందరపెడుతూ ఏడుస్తూ నమ్మించగా ఎలాంటి ఆలోచన చేయకుండా సదరు వ్యక్తి 30 వేల రూపాయలు ఫోన్ పే ద్వారా పంపించాడు. బాధితుడు తర్వాత వివరాలు తనిఖీ చేసుకోగా మోసపోయినట్లు గుర్తించి ఫిర్యాదు చేశారు.

7) సూర్యాపేట రూరల్ పరిధిలో ఒక వ్యక్తికి ఫోన్ చేసి కేరళ లాటరీ సంస్థ నుండి మాట్లాడుతున్నాము 100 రూపాయలు కట్టి లాటరీ తీసుకుంటే మీకు బహుమతి వచ్చే అవకాశం ఉంది అని నమ్మించి వంద రూపాయల లాటరీ తీపించి మరునాడు ఫోన్ చేసి మీకు లాటరీ తగిలినది డబ్బులు చెల్లిస్తే మీ అకౌంట్లో లాటరీ నగదు జమ చేస్తాము అనగా నమ్మి వివరాలు చెప్పి డబ్బు పంపిస్తాడు అతని ఖాతా నుండి 30 వేల నగదు సైబర్ మోసగాళ్ళు బదిలీ చేసుకోగా బాధితుడు మోసపోయినట్లు గుర్తించి ఫిర్యాదు చేశాడు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333