బీచుపల్లి శివ  ఆలయం దగ్గర చోరీకి పాల్పడ్డ వ్యక్తి.

Nov 5, 2025 - 19:20
 0  124

 జోగులాంబ గద్వాల 5నవంబర్ 2025తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి. 44వ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న బీచ్ పల్లి ఆంజనేయస్వామి మరియు శివాలయం దగ్గర కార్తీక పున్నమి సందర్భంగా భక్తులు పూజల నిమిత్తం గుడి దగ్గర పూజలు నిర్వహిస్తున్న  భక్తులు ఆవుల శ్రీనివాసరావు సన్నాఫ్ బుడ్డ బాలయ్య తుకిల్ పురం గ్రామం, ముస్తాపెట్ మండలం, మహబూబ్నగర్ జిల్లా, చెందిన  అయిన బీచుపల్లి శివాలయం దగ్గర  కుటుంబ సమేతంగా వచ్చి పూజలు నిర్వహిస్తున్న సమయంలో శివాలయం గుడి దగ్గర వనపర్తి జిల్లాకు సంబంధించిన ఒక వ్యక్తి 6000 రూపాయలు దొంగతనం చేసిన వ్యక్తిని గుర్తించి భక్తులు పోలీసు వారికి అప్పజెప్పడం జరిగింది. పోలీసు వారు వాణ్ని పట్టుకొని బాధితులకు డబ్బులు ఇప్పివ్వడం జరిగింది. ఆవుల శ్రీనివాస్ మొత్తం నా దగ్గర 6000 రూపాయలు ఉంటే నాకు 5000 రూపాయలు మాత్రమే ఇచ్చాడని ఆయన మీడియాకు తెలియజేశారు. ఇలాంటి వ్యక్తినిపోలీసు  అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333