రోడ్ల మరమతి కోసం ఎంపీకి వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
శాలిగౌరారం12 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– తుంగతుర్తి నియోజకవర్గం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలోని వంగమర్తి గ్రామం నుండి చిత్తలూరు వరకు(ఆర్ అండ్ బి రోడ్డు)శాలిగౌరారం నుంచి భైరవునిబండ వయా అమ్మానబోలు (ఆర్ అండ్ బి రోడ్డు)గురజాల నుండి ఉప్పలంచ (పి&ఆర్ రోడ్డు)దొనబండ ఎక్స్ రోడ్ నుంచి సాకర్ల (శాలిగౌరారం)వరకు (పి&ఆర్ రోడ్డు)రోడ్ల నిర్మాణం కోసం త్వరగా నిధులు మంజూరు చేసేలా కృషి చేయాలని,కాంగ్రెస్ నాయకులతో కలిసి శాలిగౌరారం మండల కాంగ్రెస్ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి బుధవారం హైదరాబాద్ లోని భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసి వినతి పత్రం అందజేసిన శాలిగౌరారం మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సానుకూలంగా స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడడం జరిగిందని త్వరలోనే రోడ్లు మంజూరు అవుతాయని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కందాల సమరం రెడ్డి తెలిపారు.ఎంపీని కలిసిన వారిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు చింత ధనంజయ,వడ్లకొండ పరమేష్,ఇంద్రకంటి యాదయ్య,యాదగిరి తదితరులు ఉన్నారు.