ముగ్గురు మంత్రుల‌తో కానిది.. ఓ జేసీబీ డ్రైవ‌ర్ చేసి చూపించాడు..!

Sep 2, 2024 - 18:46
Sep 2, 2024 - 19:05
 0  6
ముగ్గురు మంత్రుల‌తో కానిది.. ఓ జేసీబీ డ్రైవ‌ర్ చేసి చూపించాడు..!

9 మందిని కాపాడిన జేసీబీ డ్రైవ‌ర్‌.. సాహ‌సం ప్ర‌ద‌ర్శించిన హ‌ర్యాన‌కు చెందిన డ్రైవ‌ర్ సుభాన్‌..

ముగ్గురు మంత్రులు ఉండీ ఏమీ చేయ‌లేక‌పోయారు. ఆ వంతెన‌పై ప్రాణాల‌ర‌చేతిలో పెట్టుకుని బిక్కు బిక్కుమంటూ తొమ్మిది మంది ప్ర‌భుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారు. హెలికాప్ట‌ర్ తెప్పిస్తున్నామ‌ని చెబుతూ కాల‌యాప‌న చేశారేగానీ ఆ మంత్రులు ఒక్క అడుగు ముందుకేసింది లేదు. వారిని కాపాడే ప్ర‌య‌త్నం చేసిందీ లేదు.
పాలేరు నియోజ‌క‌వ‌ర్గంలోని వెంక‌ట‌గిరి గ్రామ‌స్తులు ప్ర‌కాశ్‌న‌గ‌ర్ వంతెన‌పైకి వెళ్లారు. వ‌ర‌ద ఉధృతిని చూస్తున్నారు. అప్ప‌టికే ఆ వ‌ర‌ద పెరిగి వంతెన‌పైకి వ‌చ్చింది. దాంట్లో 9 మంది గ్రామ‌స్తులు చిక్కుకున్నారు. ఇది తెలిసినా వారిని ర‌క్షించేందుకు ఎవ‌రూ లేరు. 15 గంట‌ల పాటు ప్ర‌భుత్వ సాయం కోసం చూస్తున్నా ఎవ‌రూ రాలేదు.ఇంకొంచెం సేప‌యితే వారు ఆ వాగు ఉధృతిలో కొట్టుకుపోయే వారే. అప్పుడే హ‌ర్యానాకు చెందిన జేసీబీ డ్రైవ‌ర్ సాహ‌సం చేశాడు. వారిని కాపాడి సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీసుకురాగ‌లిగాడు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333