సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాజు హోటల్ కూల్చివేతపై స్పందించిన

సూర్యాపేట జిల్లా కేంద్రంలో జాజు హోటల్ కూల్చివేతపై స్పందించిన మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి

Jun 15, 2024 - 21:54
 0  3

హోటల్ సందర్శించి కూల్చివేతను పరిశీలించి విలేకరులతో మాట్లాడిన ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

ప్రజా ఉద్యమాలతో రాక్షస పాలనను అడ్డుకుంటాం 

సూర్యాపేటలో జరుగుతున్న అరాచక పాలనకు మరో నిదర్శనం జాజు హోటల్ కూల్చివేత 

కేవలం రాజకీయ కక్షతోనే ప్రజలు ఓట్లు వేయలేదని ఉద్యోగులను వ్యాపారులను ఇతర పార్టీల రాజకీయ నాయకులను ప్రాణాలు కాపాడే డాక్టర్లను అందరిపై దాడులు చేయడం జరుగుతుంది 

రాజరిక పాలనలో లేని అరాచకం రాష్ట్రంలో ప్రస్తుతం సూర్యాపేటలో కొనసాగుతుంది 

ఎలాంటి ఆధారాలు లేకుండా భవనాలు  కూల్చడం ఆనవాయితీగా ఉన్నది 

జాజు హోటల్ ఎత్తు ప్రాంతంలో ఉన్నదని సూర్యాపేట సగం కొట్టుకుపోయిన ఇక్కడికి నీళ్లు వచ్చే అవకాశం లేదు 

ఐదు నెలల క్రితం ఎఫ్.పి.ఎల్ పరిధిలో ఉందని నోటీసులు ఇచ్చారని ఇది కొత్త నిర్మాణం కాదని 25 సంవత్సరాల క్రితం కొనుగోలు చేశారు

కొందరు నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ట్యాంక్ బండ్ అభివృద్ధి చెందడంతో ఆహ్లాదం కొరకు వచ్చేవారికి రుచికరమైన ఆహారం అందించేందుకు హోటల్ గా మార్చి ఇవ్వడం జరిగింది 

ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇచ్చిన నోటీసులకు సమాధానం ఇచ్చి చెరువు కట్టకంటే ఐదారు ఫీట్ల ఎత్తులో తమ హోటల్ ఉందని వారు ఇచ్చిన నోటీసే తప్పని సమాధానం ఇచ్చారూ

నోటీసుకు సంజయిషి ఇవ్వకుండా కొందరు కూల్చివేతలకు పాల్పడడం ప్రభుత్వం నుంచి ఏ శాఖకు చెందిన అధికారులు వచ్చి కూల్చారో తెలియదు

రెడ్ హౌస్  వైట్ హౌస్ అంటూ ఏమీ లేవని ఒక బ్లాక్ హౌస్ మాత్రమే నరక కుపంగా ఉందని అధికారులను అక్కడకు పిలిచి ఒత్తిళ్లకు గురిచేసి ఆదేశాలు ఇవ్వడం పరిపాటిగా మారింది 

అధికారులు నిబంధనల ప్రకారం పని చేయాలి తప్ప దారిన పోయే దానయ్యలు చెబితే కూల్చివేతలకు పాల్పడవద్దు 

మూడుసార్లు ప్రజలు బుద్ధి చెప్పిన సోయి రాకుండా మాజీ మంత్రి మతిస్థిమితం తప్పే ప్రవర్తిస్తున్నారూ

అధికారం వస్తే మంచి పనులు చేయాలి కానీ మేము దాడులు దౌర్జన్యాలు చేస్తామనడం ఓట్లు వేయని వారిని హింసకు గురి చేస్తామనడం సరికాదు 

నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలకు పాల్పడిన అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఈ విషయమై కలెక్టర్ ఎస్పీలకు విన్నవించునున్నాము 

వందేళ్ల క్రితమే తిరుగుబాటు చేసిన చరిత్ర సూర్యాపేటదని ప్రజా ఉద్యమంతో రాక్షస చర్యలను ఎదుర్కొంటాము.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333