BRS ప్రభుత్వ హయాంలో సూర్యాపేట మున్సిపాలిటీ లో

BRS ప్రభుత్వ హయాంలో సూర్యాపేట మున్సిపాలిటీ లో జరిగిన వందల కోట్ల రూపాయల అవినీతి ని వెలికి తీస్తాం.

Jun 15, 2024 - 21:56
 0  7

..
    ......... కాంగ్రెస్ కౌన్సిలర్ల బృందం

 సూర్యాపేట మున్సిపాలిటీ లో హరిత హారం, మొక్కల కొనుగోలు, నర్సరీ ల నిర్వహణ పేరుతో 2014 నుండి వందల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని, పట్టణం లో నర్సరీ లు నిర్వహిస్తూనే బయటి ప్రాంతాల నుండి మొక్కలు ఎందుకు కొనుగోలు చేయాల్సి వచ్చిందని, ఏ సంభందం లేనిదే నాటి మంత్రి మొక్కల కాంట్రాక్టర్ ఇంట్లో జరిగిన శుభాకార్యానికి వెళ్లి రెండు రోజులు ఉన్నారని, బ్లీచింగ్ పౌడర్ కొనుగోలు లో లక్షల రూపాయల అవినీతి జరిగిందని, ట్రాక్టర్ ల కొనుగోలు కాంట్రాక్టు brs నాయకుని కి ఇచ్చి నాసిరకం ట్రాక్టర్ లను కొన్నారని, కొంతమంది brs కౌన్సిలర్ లకే man power agency కాంట్రాక్టు ఇచ్చి నిరుద్యోగుల దగ్గర ఒక్కొక్క ఉద్యోగానికి 2 నుండి 3 లక్షలు గుంజినారని, పనులు చేయకుండానే చేసినట్లు బిల్లులు పెట్టి CSR ఫండ్స్ ఖాతా లో కోట్ల రూపాయలు దండుకున్నారని కాంటాక్టర్ లు చేయి తడిపితే కానీ నాటి నేటి ఛైర్పర్సన్ లు బిల్లులు పాస్ చేశేవారు కాదని, ప్రతి పనిలో నాటి నేటి ఛైర్పర్సన్ లు చేతి వాటం ప్రదర్శించారని  అంతే కాకుండా 2015,2017,2019,2021,2023 సంవత్సరాలలో జరిగిన దూరజపల్లి జాతర సందర్బంగా మున్సిపాలిటీ నుండి కేటాయించిన నిధులు పక్క తోవ పట్టాయని ఒక brs కౌన్సిలర్ అప్పటి కమీషనర్ కలిసి జాతర నిధులను కాజేసారని ఆధారాలున్నాయని,ఇట్టి విషయాన్ని సూర్యాపేట నియోజకవర్గం ఇంచార్జి శ్రీ రాంరెడ్డి దామోదర్ రెడ్డి గారి,జిల్లా మంత్రి శ్రీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి , జిల్లా ఇంచార్జి మంత్రి శ్రీ తుమ్మల నాగేశ్వర్ రావు గారి , మున్సిపల్ శాఖ చూస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకెళ్లి తెలంగాణ comptroller & auditor general గారికి ఫీర్యాదు చేస్తామన్నారు. ఇట్టి కార్యక్రమం లో గత 10 సంవత్సరాలనుండి మున్సిపాలిటీ లో జరిగిన కేటాయింపుల మరియు చెల్లింపుల వివరాలు ఇవ్వాలని కమీషనర్ గారికి మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కక్కిరేణి శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కౌన్సిలర్ ల బృందం వినతి పత్రం ఇచ్చింది.ఇట్టి  కార్యక్రమం లో కౌన్సిలర్ లు వేములకొండ పద్మ, నామ అరుణ,రాపర్తి శ్రీనివాస్ గౌడ్ దారావత్ రవి, అన్నెపర్తి రాజేష్, ఎలిమినేటి అభినయ్, ఆనంతుల యాదగిరి గౌడ్,కాంగ్రెస్ నాయకులు ఎడ్ల వీరమల్లు యాదవ్, కుంభం రాజేందర్, చిరివెళ్ల శభరి,మకట్ లాల్, లింగ నాయక్  పాల్గొన్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333