ప్రైవేట్ ఆసుపత్రులలో ధరల పట్టికను రేండు భాషల్లో ప్రదర్శంచాలి....

Aug 20, 2024 - 20:39
Aug 20, 2024 - 20:39
 0  23
ప్రైవేట్ ఆసుపత్రులలో ధరల పట్టికను రేండు భాషల్లో ప్రదర్శంచాలి....

 డాక్టర్లు, సిబ్బంది వివరాలతో కూడిన బోర్డు లను ప్రదర్శించాలి....

 యంటిపి చట్టం ఉల్లంగించి అబార్షన్స్ చేసినచో కఠిన చర్యలు తీసుకోబడును.....

సాధారణ ప్రసవాలు జరిగే విధంగా డాక్టర్లు కృషి చేయాలి....

డాక్టర్లు మెరుగైన వైద్యం అందించి సమాజం లో మంచి గుర్తింపు పొందాలి....

ప్రతి అర్హత పొందిన  వైద్యలు హాస్పిటల్ రిజిస్టేషన్ కొరకు  అనుమతి పత్రాలకు దరఖాస్తు చేసుకోవాలి...

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్.....

ప్రతి హాస్పిటల్  వారం రోజుల్లో హాస్పిటల్ కన్షల్టేషన్ పీజు వివరాలు, టెస్ట్ ల ప్రకారం ఛార్జి రేట్ వివరాలు, సిబ్బంది వివరాలతో కూడిన బోర్డు లనుహస్పటల్ ముందు భాగంలో ప్రదర్శించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరం లో జిల్లా లోని ప్రెవేట్ హాస్పిటల్ యజమానులు, డాక్టర్లతో కలెక్టర్, జిల్లా అదనపు కలెక్టర్ బి ఎస్ లత తో కలిసి సమావేశం నిర్వహించారు.  
ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతు ఓ.పి, ఐ పి కన్సల్టేషన్  పీజు వివరాలు,జనరల్ వార్డు,ఐ.సి.యు. వార్డు పీజు వివరాలు, నర్సుల పీజు వివరాలు,ఆపరేషన్ పీజులకి సంబందించిన వివరాలు, అంబులెన్సు ఛార్జి వివరాలు,సిబ్బంది అర్హతలతో కూడిన వివరాలతో ఉన్న బోర్డులను తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ప్రవేశంలోనే ప్రదర్శించాలని హాస్పిటల్ యజమానులకు, డాక్టర్లకు కలెక్టర్ సూచించారు.
హాస్పిటల్స్ లను తనిఖీ చేయుటకు ఒక టీమ్స్ ఏర్పాటు చేయటం జరిగిందని, వారం తర్వాత జిల్లాలోని అన్ని హాస్పిటల్స్ తనిఖీ చేయటం జరుగుతుందని ఛార్జి రేట్  బోర్డు లు ఏర్పాటు చేయకపోతే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డి.యం.హెచ్.ఓ. కి సూచించారు.
 ప్రొవిజినల్ సర్టిఫికెట్ ఒక సంవత్సరం గడువు తో అనుమతి పొందవచ్చు అని తదుపరి శాశ్వత అనుమతి పత్రం పొందాలని అలాగే ప్రొవిజినల్ పత్రం కొరకు క్షేత్ర స్థాయి పరిశీలన అవసరం లేదని,
డి. యం. హెచ్. ఓ.ద్వారా పొందవచ్చు అని తెలిపారు.

హాస్పిటల్ లోని డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, ఫైర్, ఎమర్జెన్సీ, పార్కింగ్, బిల్డింగ్ అనుమతులు స్థానిక సంస్థల నుండి పొందాలని కలెక్టర్ అన్నారు.అనుమతులు లేకుండా హాస్పిటల్ నిర్వహిస్తే   50,000 నుండి 5 లక్షల వరకు జరిమానా విధించటం జరుగుతుందన్నారు.బయో మెడికల్ వ్యర్దాలను  సంబంధిత ఏజెన్సీ వారికి అప్పగించాలని కలెక్టర్ తెలిపారు.

లింగ నిర్దారణ పరీక్షలు, అబార్షన్ లు చేయటం చట్ట రీత్యా నేరమని అలాంటివి ఏమైనా జరిగితే చర్యలు తీసుకుంటామని, ఆల్ట్రసౌండ్  స్కానింగ్ సెంటర్లలో అన్ని ప్రమాణాలను పాటించాలని కలక్టర్ పేర్కొన్నారు. అర్హతలేని వారితో వైద్యం అందిస్తే అటువంటి హాస్పిటల్ పై చర్యలు తీసుకోవటం తో పాటు , అనుమతి రద్దు చేయటం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.
వైద్యం తదుపరి మందులు హాస్పిటల్ ఫార్మసి నందు మాత్రమే తీసుకోవాలని యజమాన్యం ప్రజలపై ఒత్తిడి చేయరాదని వారికి నచ్చిన చోట మందులు తీసుకునే విధంగా చూడాలన్నారు.

గైనకాలజిస్ట్ లు తమదగ్గరికి వచ్చే గర్బావతులకు జెనిటిక్స్ సమస్యలు,పోషకాలు తో కూడిన ఆహారం పై పలు సూచనలు ఇవ్వాలని , తల్లి బిడ్డ క్షేమంగా ఉంటారని అన్నారు.ప్రభుత్వ హాస్పిటల్స్ లో కన్నా ప్రెవేట్ హాస్పిటల్స్ లో సీజేరియన్లు ద్వారా ప్రసవాలు జరుగుతున్నాయని వాటిని తగ్గించి సాధారణ ప్రసవాలు అయ్యే విధంగా ప్రెవేట్ హాస్పిటల్స్ డాక్టర్లు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అన్నారు. కొంతమంది ప్రజలు మంచి ముహూర్తం చూసుకొని ముహూర్త సమయానికి ప్రెవేట్ హాస్పిటల్ లో సీజెరియన్ చేపించుకుంటున్నారని అలా చేయటం మంచిది కాదని,డాక్టర్లు  ప్రజలకు మెరుగైన వైద్యం అందించి సమాజం లో మంచి గుర్తింపు పొందాలని కలెక్టర్ అన్నారు.

హాస్పిటల్ నిర్వహణకు గడువు తీరిన, పునరుద్దరణ కొరకు అనుమతి పత్రాలు పొందుటకు ఈ నెల 31 వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని  అన్నారు.
దరఖాస్తు చేసుకున్న వారికి తదుపరి వెంటనే రూల్స్ పాటించిన హాస్పిటల్ వారికి అనుమతి పత్రాలు జారీ చేయటం జరుగుతుందని, అలాగే ఆయుష్ విభాగం లో కూడా అనుమతులు పొందవచ్చని, 
హాస్పిటల్స్ వారు 3 సంవత్సరాల వరకు మెడికల్ రికార్డ్స్ భద్రపరచాలని కలెక్టర్ సూచించారు.సేవాభావ ద్రక్పదంతో వైద్యం చేయాలని కలక్టర్ తేలిపారు.

ఈ సమావేశం లో డి.యం.హెచ్.ఓ. కోటాచలం, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సూపరిటీడెంట్ డాక్టర్ శ్రీకాంత్,.డి.సి.హెచ్.ఎస్. డాక్టర్ వెంకటేశ్వర్లు, ప్రెవేట్ హాస్పిటల్స్ యాజమాన్యం, డాక్టర్లు,సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State