జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో పని చేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించకుండా
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులలో పని చేస్తున్న కార్మికులకు జీతాలు చెల్లించకుండా వేధిస్తున్న అధికారులు మరియు కాంట్రాక్టర్ వెంటనే జీతాలు చెల్లించి సదరు కాంట్రాక్టర్ మరియు కార్మికులను వేధింపులకు గురి చేస్తున్న బాధ్యులను శిక్షించాలని ఎ.ఐ.టి.యు.సి మరియు అఖిలపక్ష ఐక్యవేదిక డిమాండ్.
వనపర్తి జిల్లా కేంద్రంలో మూడు నెలలుగా ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్స్ కార్మికులకు జీతాలు ఇవ్వకపోవడంతో జనరల్ హాస్పిటల్ ముందు శుక్రవారం కార్మికులు ధర్నా చేశారు. కార్మికులకు అఖిలపక్ష ఐక్యవేదిక మద్దతు తెలపడం జరిగింది.
ఈ సందర్భంగా సతీష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా ఆస్పత్రిలో రెండు సంవత్సరాలుగా కార్మికుల పేరిట జీతాలు మాయం కావడం జరుగుతుందని దానిపై ఎంక్వయిరీ చేయాలని పలుమార్లు ఐక్యవేదిక కోరిందని, కానీ విచారణ పేరుతో కార్మికుల వేతనాలు నిలిపివేయడం సమంజసం కాదన్నారు. 148 మంది కార్మికులు పనిచేస్తున్నట్లుగా చూయిస్తూ వారి జీతాలు మాయం చేయడం జరిగిందని, కొందరు వారిని నియమిస్తూ వారి జీవితాలు తీసుకున్నట్లుగా తెలిసిందని, వారి అకౌంట్లో డబ్బులను పరిశీలిస్తే తెలుస్తుందని తెలుపుతూ, ఎంక్వయిరీ పేరుతో మూడు నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో స్కూలు ఓపెన్ అయ్యే టైములో డబ్బులు లేక అల్లాడుతున్న కార్మికులు ఈరోజు ధర్నా చేయడం జరిగింది వారికి మద్దతుగా ఏ.ఐ.సీ.యూ.సీ రాష్ట్ర నాయకులు సురేష్ జిల్లా నాయకులు, గోపాలకృష్ణ, ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు సతీష్ యాదవ్, ఎస్సీ, ఎస్టి మానిటరింగ్ కమిటీ సభ్యులు గంధం నాగరాజు తదితరులు మద్దతు తెలుపుతూ వెంటనే వారి వేతనాలు చెల్లించి ఆసుపత్రిలో జరుగుతున్న అక్రమాలను విచారణ చేయాలని డిమాండ్ చేశారు.
అంతేకాకుండా మాతా శిశు సంరక్షణ అంబులెన్స్ ను మరియు ఆస్పత్రిలోని పాత మరియు కొత్త ఇనుప మంచాలు, తదితరు సామాన్లు టెండర్ లేకుండా అమ్ముకున్నారని వాటిపై విచారణ చేసి దోషులను శిక్షించాలని, ఐక్యవేదిక డిమాండ్ చేస్తుంది. వెంటనే జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు దీనిపై చర్యలు తీసుకోవాలని బాధ్యులను శిక్షించాలని లేనియెడల ఆందోళన పెద్ద ఎత్తున చేస్తామని తెలిపారు.