సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి
@ గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చు పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
@ డాక్టర్లు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలి
జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఇక పై వైద్యులు, సిబ్బంది విధుల్లో క్రమశిక్షణ, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. గురువారం ఆయన ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పురుషుల, మహిళల ఓ పి రూమ్ లను సందర్శించి ఔట్ పేషెంట్ రిజిస్టర్ లు పరిశీలించి, ఎంతమంది అవుట్ పేషంట్స్ ఈరోజు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు తదుపరి ఏఎంసి వార్డును తనిఖీ చేశారు ఈ సందర్భంగా డ్యూటీ డాక్టర్లను ఈరోజు పేషెంట్లకు వైద్య సేవ అందించు రౌండ్స్ పూర్తయ్యాయ అడిగి తెలుసుకున్నారు, పీఎంజేవై, ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భారత్ పేషెంట్ రిజిస్ట్రేషన్ కౌంటర్ ను, డ్రగ్స్ స్టోర్ రూమ్ ను, జనరల్ మెడిసిన్ డాక్టర్ రూమ్ ను తనిఖీ చేశారు. డయాగ్నస్టిక్ రూమ్, బ్లడ్ శాంపిల్ కౌంటర్ ను తనిఖీ చేసి ఈరోజు పేషెంట్లకు ఏమేమి పరీక్ష నిర్వహించారు, రిపోర్టు ఎలా ఉన్నవి అని రిపోర్ట్స్ పరిశీలించారు, డయాగ్నస్టిక్ కెమికల్స్ వివరాలు సిబ్బందిని అడిగితెలుసుకున్నారు తదుపరి జనరల్ వార్డును తనిఖీ చేసి పేషంట్ల వివరాలను డ్యూటీ డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు, అక్కడే మెడిసిన్ రియాక్షన్ వలన చికిత్స పొందుతున్న తిరుమలగిరి కి చెందిన రహీమా బేగం ను పరామర్శించి రియాక్షన్ కు గల కారణాలను అడిగి తెలుసుకుని ఆమె కు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆర్ఎం ను ఆదేశించారు. తదుపరి కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం వర్షాకాలం కావడంతో డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా వంటి సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, మెడికల్ వార్డులను నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు. ప్రతిరోజూ ఫీవర్ కేసులు, అడ్మిషన్లు, డిశ్చార్జ్ వివరాలను అప్‌డేట్ చేయాలని చెప్పారు. మందుల కొరత లేకుండా బఫర్ స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు
ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు, అత్యాధునిక శస్త్రచికిత్సల కోసం ఉపయోగించు మందులు, పరికరాల కొనుగోలుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చు పేద ప్రజల పట్ల మర్యాదగా వ్యవహరిస్తూ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని, విధుల పట్ల అలసత్వం ప్రదర్శించరాదని, దూర ప్రాంతాల నుండి వచ్చు వృద్ధులకు వికలాంగులకు బయట వీల్ చైర్లు అందుబాటులో ఉంచాలని ఆర్ ఎం ను డ్యూటీ డాక్టర్లను ఆదేశించారు. అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా డ్రెస్ కోడ్ పాటించాలని, ఐడీ కార్డులు ధరించాలని
ఆదేశించారు.
కార్యక్రమంలో డాక్టర్లు వాణి, జనార్ధన్, అనిత, శ్రీలత, ఉపేందర్, యశ్వంత్, వినయ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
--------------------------------
జిల్లా పౌర సంబంధాల అధికారి సూర్యాపేట వారిచే జారీ చేయనైనది