ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో పోలీస్.., 

శాంతి భద్రతల రక్షణకు అనుక్షణం కృషి...

Aug 30, 2026 - 23:08
Aug 30, 2026 - 23:08
 0  0
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో పోలీస్.., 
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో పోలీస్.., 

సూర్యాపేట డిఎస్పీ ప్రసన్న కుమార్.

బిబీగూడెం గ్రామంలో పోలీస్ కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్..

సరైన అనుమతి పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 4 కార్లు సీజ్.

సూర్యాపేట రూరల్, 31 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- సెర్చ్ ఆపరేషన్ లో పాల్గొన్న సూర్యాపేట డివిజన్ డిఎస్పీ ప్రసన్న కుమార్, సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, స్థానిక ఎస్ఐ లు మహేష్, సర్కిల్ ఎస్ఐ సహా 50 మంది పోలీసు సిబ్బంది. గ్రామంలోకి వచ్చే పోయే అన్ని మార్గాలను పోలీసు అధీనంలో ఉంచి గ్రామంలో ప్రతి ఇల్లు తనిఖీ చేసి భద్రత అంశాలు పర్యవేక్షణ చేశారు. అనుమానితుల గురించి తనిఖీ చేసి ఫింగర్ ప్రింట్ డివైన్ తో వెలి ముద్రలను పరిశీలించారు. సరైన అనుమతి పత్రాలు లేని 52 ద్విచక్ర వాహనాలు, 4 కార్లు సీజ్ చేశారు. ఈ సందర్భంగా డిఎస్పి ప్రసన్నకుమార్ స్థానిక గ్రామ ప్రజలతో మాట్లాడి సామాజిక అంశాల పట్ల భద్రత పరమైన చర్యల పట్ల అవగాహన కల్పించారు. వాహనాలకు అనుమతి పత్రాలు, నంబర్ ప్లేట్స్ లేకపోతే నేరాలు ప్రమాదాలు జరిగినప్పుడు గుర్తింపు కష్టమవుతుందని పోలీసు దర్యాప్తు ఇబ్బంది అవుతుందని. ప్రజల భద్రత కోసం రక్షణ కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడు కృషి చేస్తుందని నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటామని శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజల సహకారంతో ఆధునిక పోలీసింగ్ నిర్వహిస్తున్నామని అన్నారు. నేరాల నివారణలో ప్రజలు పోలీస్ తో భాగస్వామ్యం కావాలని గ్రామాలలో ఎక్కువ మొత్తంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. యువత ఆదర్శంగా ఉండాలని అన్నారు. కొత్త వారికి ఆశ్రయం ఇవ్వకూడదని అన్నారు. అనుమానం కలిగేలా ఎవరైనా వ్యక్తులు తారసపడిన అనుమానిత వ్యాపారాలు నిర్వహిస్తున్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని 112 తెలియజేయాలని తెలిపారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని డ్రగ్స్ లాంటివి మన గ్రామంలో రాకుండా భావితరాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైందని తెలిపారు. రోడ్డు ప్రమాదాల వల్ల ఎన్నో కుటుంబాలు చిన్న విన్నమవుతున్నాయని ప్రయాణ సమయంలో ముందస్తు జాగ్రత్తలు పాటిస్తూ ప్రయాణించాలని తెలిపారు. సైబర్ మోసాల వల్ల ఆర్థిక నష్టం జరుగుతుందని, అత్యాశకు పోయి వ్యక్తిగత వివరాలను అపరిచితులకు తెలియజేయడం వల్ల సైబర్ మోసాలకు గురవుతున్నారని అన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333