ఆరు గ్యారెంటి లను అమలు చేయాలెని కాంగ్రెస్ ప్రభుత్వం 

Sep 3, 2026 - 20:26
 0  2
ఆరు గ్యారెంటి లను అమలు చేయాలెని కాంగ్రెస్ ప్రభుత్వం 
ఆరు గ్యారెంటి లను అమలు చేయాలెని కాంగ్రెస్ ప్రభుత్వం 

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన లో ప్రజలకు చేసింది ఏమిటీ

ములుగు జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి నాగరమేష్

 ములుగు జిల్లా, సెప్టెంబర్ : 3 : మంగపేట మండలం మల్లూరు గ్రామంలో ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి బాడిశ నాగరమేష్ ఆధ్వర్యంలో ఏటూర్ నాగారం బూర్గం పహాడ్ ప్రధాన రహదారిపై కాంగ్రెస్ పార్టీ వెయ్యి రోజుల పాలన వైఫల్యాలను నిరసిస్తూ ధర్నా ను రాస్తారోకో ను నిర్వహించారు. ఈ సందర్భంగా బాడిశ నాగరమేష్ మాట్లాడుతూ వెయ్యి రోజుల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన లో ప్రజలు ఎవరూ సంతోషం గా లేరని అన్ని రంగాల ప్రజలను తీవ్రం గా మోసం చేసిందని తెలిపారు .అనాడు బిఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ఇప్పటి ప్రభుత్వం తుంగలో తొక్కి,వొక్కో సంక్షేమ పథకాన్ని తూట్లు పొడుస్తూ ముందుకు వెళ్తావుంది.ఎన్నికల ముందు మా ప్రభుత్వం వొచ్చిన వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి వెయ్యి రోజులైనా ఏ ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడం లో పూర్తిగా విఫలమైందని  తెలియజేశారు.ముఖ్యంగా రైతులకు ఇస్తా అన్న రెండులక్షల రుణమాఫీ పూర్తి స్థాయి లో ఇవ్వలేదు.ఎకరాకు పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి అరకొర గా ఇచ్చి చేతులు దులుపు కుంటుంది.ధాన్యానికి క్వింటాల్ కు అయిదు వందల రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పి అయిదు రకాల వెరైటీ లకు మాత్రమే ఇస్తున్నారు అని యూరియా డిఏపి ఎరువులు దొరకక రైతులు ఇబ్బంది పడుతున్నారని ఇప్పుడు రైతు భీమా పథకాన్ని కూడా నిలిపివేసే ప్రయత్నం చేస్తున్నారని రైతు భీమా పథకాన్ని కొనసాగేవిధం గా చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అలాగే మహిళలకు ఇస్తామన్న 2500/-రూపాయలు 500 రూపాయల కి సిలిండర్ కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ లక్ష రూపాయలు తో పాటు తులం బంగారం ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.దాదాపు గా గంట కు పైగా రహదారి పై బైఠాయించడం తో ట్రాఫిక్ కు కొంత అంతరాయం కలిగింది.ఈ కార్యక్రమం లో ములుగు జిల్లా బి ఆర్ ఎస్ పార్టీ మహిళా నాయకురాలు కొమరం ధనలక్ష్మి జిల్లా నాయకులు కుర్బాన్ ఆలీ పూజరి శ్రీనివాస్ కర్రి శ్యామ్ బాబు సిద్ధం శెట్టి లక్ష్మణ్ రావు దంతాలపల్లి నరేందర్ గాదె శ్రీను మూగల రమేష్,అయూబ్ గ్రామకమిటీ అధ్యక్షులు తుక్కని శ్రీనివాస్ సోయం ఈశ్వర్ రూప భద్రయ్య పండా శ్రీను మునిగేలా సాంబూల్ పొదెం రాంబాబు చింతా చందర్ రావు కొప్పుల మాణిక్యం కొమరం పుల్లారావు ముసలయ్య బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు పబ్బోజు సత్యనారాయణ మంచాల నాగేందర్ నిమ్మగడ్డ ప్రవీణ్ యాకన్న సుంకోజు ప్రశాంత్ ఓదెల సుధీర్ కొమరం చంటి మేకల పుల్లారావు చింత గోపాల్ రఘు చిట్టిబాబు
గోడుగునరేష్ చంద్రకాంత్ పురుషోత్తం గుండారపు రమేష్,మండల సంతోష్ ఇందారపు రమేష్,మునిగేలా మహేష్ దామోదర్ రాంబాబు రెహమత్ జగన్ తొలెం బాలకృష్ణ,నజ్జు పెద్ద సంఖ్యలో మహిళలు కార్యకర్తలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333