ఫీజు నియంత్రణకు చట్టం తీసుకురావాలి

Jun 21, 2026 - 19:22
 0  1
ఫీజు నియంత్రణకు చట్టం తీసుకురావాలి

తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ కార్పోరేట్ విద్యా సంస్థల ఫీజుల దోపిడీ అడ్డుకోవడానికి ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలనే అంశంపై ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ (PSU) ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో  రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి పి.ఎస్.యు రాష్ట్ర అధ్యక్షులు ఆవుల నాగరాజు అధ్యక్షత వహించారు.  ప్రభుత్వ పాఠశాలల్లో మౌళిక సదుపాయాలు, నాణ్యమైన విద్యను కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. ఆ నెపం ప్రభుత్వ ఉపాధ్యాయుల మీద నెట్టి వేస్తున్నారు. ముఖ్యమంత్రి 27 వేల పాఠశాలను 4 వేలకు తగ్గించాలని ప్రకటించడం ఖండించదగ్గ విషయం.ప్రభుత్వ విధానాల మూలంగానే ప్రజలు వారి పిల్లలను ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల సంఖ్య నేడు 65% కి పైగా పెరిగింది.విద్యభోధన అనగానే ప్రైవేటు, కార్పోరేట్ పాఠశాలలో మాత్రమే నాణ్యమైన విద్య అందే అవకాశం ఉంది అనే ‌భావన తల్లిదండ్రుల్లో నెలకొనే విధంగా ఆయా ప్రైవేటు కార్పొరేట్ యాజమాన్యాలు ప్రచారం చేస్తున్నాయి.మండల, జిల్లా స్థాయి అధికారులు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థల ప్రలోభాలకు గురై తనిఖీలు నిర్వహించడం లేదు. జీవో నెంబర్ 1 అమలు చేయడం లేదు 2009 చట్టంలోని అంశాలను అమలు చేయడం లేదు.ఈ ఏడాది ప్రారంభానికి ముందే తెలంగాణ సర్కారు ఫీజుల నియంత్రణ చట్టం రూపొందిస్తామని చెబుతూ దాట వేయడం తో ప్రైవేటు పాఠశాలల ఫీజుల దోపిడీ నిరాటంకంగా సాగుతోంది.పాలకుల వైఫల్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో అధిక ఫీజుల భారం తట్టుకోలేక విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.
తక్షణమే ఫీజుల నియంత్రణ ఆవశ్యకమైన విషయంగా దీన్ని చట్టం చేసి అమలు పరచాలని ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ విద్యా పరిరక్షణ కమిటీ  రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్నారు. భారతదేశంలో తెలంగాణలో జరుగుతున్న ప్రైవేటీకరణ మరి ఎక్కడా లేదు అన్నారు. కామన్ స్కూల్ విద్యా విధానం లేకుండా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఎలా పెడతారని ప్రశ్నించారు.దేశంలో రోజు రోజుకు తీవ్రమవుతున్న ద్రవ్యోల్బణంతో ప్రజల వినియోగ స్థాయి దిగజారి అనేక కష్టాల పాలవుతున్నారు. విద్యారంగంలో అసమానతలు ఉండకూడదు. విద్య అందరికీ సమానంగా అందినప్పుడే సమాజం పురోగమిస్తుందన్నారు. కాని పాలకులు ఉచితంగా విద్యనందించే భాద్యత నుండి రోజు రోజుకు వైదొలుగుతూ విద్యా రంగాన్ని పూర్తిగా ప్రైవేటు పరం చేస్తున్నారు. బడ్జెట్లో విద్యారంగానికి 15% నిధులు కేటాయిస్తామని మ్యానిఫెస్టోలో చేర్చి కేవలం 8 శాతం నిధులు  కేటాయించారు.
వెంటనే ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసే విధంగా బడ్జెట్లో 20 శాతం నిధులను కేటాయించాలి ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలను  ప్రభుత్వమే స్వాధీనం చేసుకొని  నడపాలన్నారు.

అసిస్టెంట్ ప్రొఫెసర్ జానకి  రెడ్డి, లింగంపల్లి భద్రయ్య  సూర్యాపేట సామాజిక అధ్యయన వేదిక కన్వీనర్.
 సీనియర్ జర్నలిస్టు రమణాచారి,రేపాక లింగయ్య డిటిఎఫ్, రాచూరి ప్రతాప్ టిపిటిఎఫ్,
మాల మహానాడు అధ్యక్షుడు తల్లమల్ల హస్సేన్,
యోగానంద,షేక్ ఉమర్ డిటిఎఫ్,
అబ్దుల్ కరీం సి యు సి, 
మాధవ రెడ్డి రైతాంగ సమితి 
వెంకట్ యాదవ్ బహుజన సభ 
బుద్ధ సత్యనారాయణ సిపిఐ ఎంఎల్ 
పేరెంట్స్ అసోసియేషన్ దుర్గాప్రసాద్,
కోటయ్య టి పి ఎఫ్ 
తగుళ్ల జనార్ధన్ యాదవ్ , సందీప్,హరీష్, బీసీ విద్యార్థి సంఘం వీరబోయిన లింగయ్య,
మదార్ గౌడ్ టిపిఎఫ్ ,వెంకట్
పబ్బతి వెంకటేశ్వర్లు డిటిఎఫ్
వినయ్ మాల మహానాడు, 
సాయికుమార్ సిపిఎం,
నవిలే ఉపేందర్,
ఉద్యమాభివందనాలతో..
ప్రోగ్రెసివ్ స్టూడెంట్స్ యూనియన్ (PSU),
బి కుమార్, 
మచ్చ వంశి. 
ఉమ్మడి నల్లగొండ జిల్లా కమిటీ.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333