రేవంత్ రెడ్డి పైన అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తుల పైన చట్టరీత్య చర్యలు తీసుకోవాలి
యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు బైరెడ్డి సందీప్ రెడ్డి
అడ్డగూడూరు 20 జులై 2026 తెలంగాణవార్త రిపోర్టర్:– కాంగ్రెస్ అధిష్టాన నాయకుల పైన అనుచిత వాఖ్యలు చేసిన వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలని అడ్డగూడూరు మండల కాంగ్రెస్ నాయకులు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది.జూలై 18 సరూర్ నగర్ లో జరిగిన బిఆర్ఎస్ పార్టీ యువ సంగ్రామ సభలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి. రామారావు సమక్షంలో...లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిలపై బిఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన వ్యాఖ్యలను అడ్డగూడూరు మండల యూత్ కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండించింది. వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ..ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి సందీప్ రెడ్డి కంచనపల్లి సర్పంచ్ చెడే అంబేద్కర్,యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి కడారి రమేష్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు గూడెపు పాండు,జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులు మారిశెట్టి మల్లేష్,వార్డ్ సభ్యులు సుంకర బోయిన అఖిల్,షేక్ సమీర్, అడ్డగూడూరు మండల యూత్ నాయకులు పి వరుణ్ గౌడ్,తదితరులు పాల్గొన్నారు.