తిరుమలగిరిలో వెయ్యి రోజుల పాలన వేడుకలు

Sep 3, 2026 - 21:37
 0  3
తిరుమలగిరిలో వెయ్యి రోజుల పాలన వేడుకలు

తిరుమలగిరి 04 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్

  గత బీఆర్ఎస్ ప్రభుత్వం తన తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రాష్ట్రాన్ని రూ.8 లక్షల కోట్ల భారీ అప్పుల ఊబిలోకి నెట్టినా, ఆర్థిక ఇబ్బందులను సమర్థవంతంగా అధిగమించి కాంగ్రెస్ ప్రభుత్వం సుపరిపాలన అందిస్తుందని తిరుమలగిరి మండల కేంద్రంలోని వెయ్యి రోజుల ప్రజా పాలన సంక్షేమ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు సుంకర జనార్ధన్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన సూపర్ హిట్‌గా నిలిచిందని ఆయన పేర్కొన్నారు తుంగతుర్తి నియోజకవర్గ అభివృద్ధి దిశలో పరుగులు పెడుతుంది అన్నారు ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ ధరావత్ జుమ్మిలాలు  చైర్మన్ పాలెపు చంద్రశేఖర్.   మాజీ మండల పార్టీ అధ్యక్షుడు  ఎల్సొజు నరేష్   తిరుమలగిరి మున్సిపాలిటీ  6వ వార్డు కౌన్సిలర్ తిరుమణి యాదగిరి. 7వ.వార్డు కౌన్సిలర్  బత్తుల శ్రీనివాస్. 9వ వార్డు కౌన్సిలర్   కన్నెబోయిన మల్లయ్య మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు   మండల పరిధిలోని వివిధ గ్రామాల  కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు సర్పంచులు.  మాజీ ఎంపీటీసీలు. యూత్ కాంగ్రెస్ నాయకులు  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి