గౌరవ డాక్టరేట్ సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాలకు నామినేషన్ల ఆహ్వానం
భారత్ గౌరవ్ సమ్మాన్–2026 నామినేషన్లకు ఆహ్వానం
భారత్ గౌరవ్ సమ్మాన్–2026కు నామినేషన్ల ప్రారంభం
హైదరాబాద్, 18 జూలై 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:- విశిష్ట సేవలకు జాతీయ స్థాయి అవార్డుల పిలుపు గౌరవ డాక్టరేట్ సహా పలు ప్రతిష్ఠాత్మక పురస్కారాల ప్రదానం ప్రతిభను గుర్తించే మహా వేదిక సిద్ధం ఆగస్టు 30 వరకు దరఖాస్తులకు అవకాశం. సామాజిక బాధ్యత, విద్య, జర్నలిజం, సాంస్కృతిక, కళా, సాహిత్య, వైద్య, సామాజిక సేవ తదితర రంగాల్లో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులను సత్కరించేందుకు "భారత్ గౌరవ్ సమ్మాన్–2026 & సమ్మిట్" పేరుతో ప్రతిష్ఠాత్మక అవార్డుల ప్రదానోత్సవాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు.
ఈ కార్యక్రమాన్ని ఆసియా వేదిక్ ఇంటర్నేషనల్ కల్చర్ అండ్ స్పూర్తి అకాడమీ, స్పూర్తి ఇంటర్నేషనల్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, స్పూర్తి సర్వీసెస్ సొసైటీ ఇండియా ( ఎన్ జి ఓ ) మరియు పీస్ ఆఫ్ ఇండియా ( ఎన్ జి ఓ ) సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. ఈ వేడుకలో గౌరవ డాక్టరేట్, ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు, నారి శక్తి అవార్డు, సేవా రత్న, ప్రైడ్ ఆఫ్ భారత్, నంది అవార్డు, గ్లోబల్ అవార్డులు తదితర విభాగాల్లో ప్రతిభావంతులను ఎంపిక చేసి ఘనంగా సత్కరించనున్నారు. అవార్డులకు దరఖాస్తుల స్వీకరణ 2026 జూలై 9 నుంచి ప్రారంభమై 2026 ఆగస్టు 25 వరకు కొనసాగుతుందని నిర్వాహకులు తెలిపారు. అర్హులైన అభ్యర్థులు తమ వివరాలను నిర్ణీత గడువులోగా సమర్పించాలని కోరారు.
ఈ కార్యక్రమానికి లయన్ డా. అకుల రమేష్ నాయకత్వం వహిస్తున్నారు. ఆయన స్పూర్తి సర్వీస్ సొసైటీ ఇండియా ( ఎన్ జి ఓ ) వ్యవస్థాపకుడు & చైర్మన్గా సేవలందిస్తున్నారు. అలాగే 2018లో ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడంతో పాటు, తెలంగాణ వినియోగదారుల మండలి ప్రధాన కార్యదర్శి, జాతీయ మానవ హక్కుల బోర్డు కమిటీ సభ్యుడు, తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడు, పీస్ ఆఫ్ ఇండియా తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంటి పలు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం తెలంగాణ సారస్వత పరిషత్, కింగ్ కోటి, తిలక్ రోడ్, బొగ్గులకుంట, హైదరాబాద్ – 500001లో నిర్వహించనున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలు, నామినేషన్లు మరియు నమోదు కోసం 8297726613, 9010177845 నంబర్లను సంప్రదించాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు.