విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలి
తిరుమలగిరి 04 సెప్టెంబర్ 2026 తెలంగాణ వార్త రిపోర్టర్
విద్యార్థులు ఇష్టంతో కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించి కన్న తల్లిదండ్రులతో పాటు విద్య నేర్పిన గురువుల పేరును తీసుకురావాలని తిరుమలగిరి మండల విద్యాధికారి ఐ. శాంతయ్య కోరారు. గురువారం మున్సిపల్ పరిధిలోని అనంతారం తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్లో జరిగిన ఇంటర్మీడియట్ విద్యార్థుల ప్రెషర్స్ డే సందర్భంగా ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కన్న తల్లిదండ్రులు జీవితాన్ని ఇస్తే గురువులు ప్రపంచ విజ్ఞానంతో ప్రపంచానికి తెలియజేస్తారని ఆయన అన్నారు. మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ పెద్దకోల సంజీవ్ కుమార్ మాట్లాడుతూ అనంతారం మోడల్ స్కూల్ కళాశాలకు విద్యార్థుల కృషి మూలంగా ఎంతో గుర్తింపు వచ్చిందని ఆయన అన్నారు.కళాశాల జీవితం అనేది ప్రతీ విద్యార్థి జీవితంలో అత్యంత కీలకమైన ఘట్టం. కేవలం మార్కుల కోసమే కాకుండా, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.సాంకేతికతను సానుకూలంగా వాడుకుంటూ, క్రమశిక్షణతో కూడిన లక్ష్యాలను ఏర్పరుచుకోవాలి. కళాశాల అందించే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, భవిష్యత్తులో అత్యున్నత శిఖరాలను అధిరోహించాలి" అని ప్రిన్సిపాల్ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో ఎన్ని కష్టాలు వచ్చినా చదువు కొనసాగిస్తూ,మంచి విద్యను ఆర్జించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలకు ఎదగాలని తెలియజేశారు. పాఠశాల కళాశాల విద్యార్థులు తమ అధ్యాపకులు చెప్పే విద్యా బోధనతో కష్టపడి చదివి అత్యధిక మార్కులు సాధించి మంచి గుర్తింపు తీసుకురావాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం ప్రథమ సంవత్సరం విద్యార్థుల పలు సాంస్కృతిక కార్యక్రమాలు పలువురిని ఆకట్టుకున్నాయి.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ క్రాంతి కిరణ్, అధ్యాపకులు మోహన్, సురేష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎస్కే చాంద్, జమీల బేగం వనిత రెడ్డి, ఇందిరా, సంగీత, స్వాతి, రాజు, ప్రభాకర్, శ్రీనివాస్, యాకన్న. ఉపాధ్యాయులు భరత చారి, జగన్ నాయక్, యాకుబ్ పాషా, లక్ష్మయ్య,నుశ్రత్ సుల్తానా బేగం, జోసెఫ్, వెంకటయ్య, వీరమల్లు, పద్మ, జ్ఞానేశ్వరి మరియు విద్యార్థులు పాల్గొన్నారు.