ఇద్దరు ఐపీఎస్‌లు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాపై సస్పెన్షన్ ఎత్తివేత

Sep 3, 2026 - 20:31
 0  2
ఇద్దరు ఐపీఎస్‌లు విశాల్ గున్ని, కాంతి రాణా టాటాపై సస్పెన్షన్ ఎత్తివేత

అమరావతి: రాష్ట్రంలో ఇద్దరు సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఉన్న సస్పెన్షన్‌ను రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. 2010 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి విశాల్ గున్ని, 2004 బ్యాచ్‌కు చెందిన కాంతి రాణా టాటాపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ అధికారిక ఉత్తర్వులను విడుదల చేసింది. సస్పెన్షన్ ఎత్తివేతతో పాటు వీరిద్దరినీ తక్షణమే విధుల్లోకి తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. దీంతో ఇద్దరు పోలీసు ఉన్నతాధికారులకు ఊరట లభించింది.

గతంలో వీరిపై సస్పెన్షన్ వేటు

గతంలో ఎదురైన ఆరోపణలు, విచారణల నేపథ్యంలో వీరిపై సస్పెన్షన్ వేటు పడింది. అయితే తాజాగా ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని సమీక్షించి సస్పెన్షన్‌ను ఉపసంహరించుకోవడంతో వీరి తదుపరి పోస్టింగ్‌లకు సంబంధించిన ఆదేశాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333