విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో 39వ భాగవత సప్తహం.
జోగులాంబ గద్వాల 1 సెప్టెంబర్ 2026 తెలంగాణవార్త ప్రతినిధి:- మండలం లోని చాగపురం గ్రామంలో శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి శ్రీరాములవారు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి ఆవరణంలో 39 వ పారాయణం శ్రీ బమ్మెర పోతనామాత్యుడు రచించినటువంటి శ్రీ మదాంధ్ర మహాభాగవత సప్తాహం స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం దక్షణాయనం వర్ష ఋతువు శ్రావణమాసం కృష్ణపక్షం పంచమి తేదీ:- 02-09-2026 బుధవారం నుండి తేదీ:-08-09-2026 మంగళవారం ద్వాదశి వరకు 7 రోజుల పాటు పారాయణం జరుగును. చాగాపురం గ్రామం నందు శ్రీశ్రీశ్రీ ఆంజనేయ స్వామి శ్రీ రాముల వారు శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి గుడి ఆవరణములో శ్రీ రామానుజ చిన్న జీయర్ స్వామి వారి మంగళ శాసనం లతో 39 వ పారాయణం శ్రీ బమ్మెర పోతనామాత్యుడు రచించినటువంటి శ్రీ మదాంధ్ర మహాభాగవత సప్తాహం స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం కృష్ణపక్షం తిధి పంచమి తేదీ :-02-09-2026 బుధవారం నుండి తేదీ: 08-09-2026 మంగళవారం ద్వాదశి వరకు 7రోజుల పాటు పారాయణం జరుగును. శ్రీశ్రీశ్రీ శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి శిష్య బృందం, చాగాపురం గ్రామ ప్రజలు మరియు భాగవత సప్తాహకులు అందరు కార్యక్రమంలో పాల్గొని దిగ్విజయం చేయగలరని కోరుచున్నాము.