తక్షణమే CI ని సస్పెండ్ చేయాలని బాధితులకు న్యాయము చేయాలని డిమాండ్
కోదాడ, 31 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- ఈ రోజు కోదాడ నియోజకవర్గ కేంద్రంలో బీసీ జన సభ, బీసీ సంఘాలు, యాదవ సంఘాల ఆధ్వర్యంలో కనక మహా లక్ష్మి యాదవ్, ఉపేందర్ యాదవ్ లకు సంఘీభావం ప్రకటంచడం జరిగింది. ఈ సందర్బంగా బీసీ జన సభ రాష్ట్ర అధ్యక్షులు డి రాజారామ్ యాదవ్ మాట్లాడుతూ రాజకీయ కుట్ర లో, కక్ష లో భాగంగానే కనక మహా లక్ష్మి కిరాణా కొట్టును తొలగించడం జరిగింది అని, ఉపేందర్ యాదవ్ పై అక్రమ కేసులు బనాయించడం జరిగింది అని CI శివశంకర్ అత్యంత దారుణంగా ఉపేందర్ పై కనక మహా లక్ష్మి కుటుంబం పై దాడి చెయడం జరిగింది. అని మహిళ లు అని చూడకుండా నిసుగ్గుగా దాడి చెయడం జరిగింది అని చెప్పారు. తక్షణమే CI ని సస్పెండ్ చేయాలని బాధితులకు న్యాయము చేయాలని డిమాండ్ చేశారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆపము అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కు, డీజీపీ కి మహిళ కమిషన్ కు పిర్యాదు చేస్తామని అప్పటికి న్యాయం జరగక పోతే హైదరాబాద్ లో ని ఇందిరా పార్క్ దగ్గర భారీ భహిరంగ సభ నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో మేకల రాములు యాదవ్, లోడంగి గోవర్ధన్ యాదవ్, వెంకటేష్ గౌడ్, సుదగాని వెంకటేష్ గౌడ్, బెల్లి చంద్ర శేఖర్, మేకల కృష్ణ, వాసు కే, రేణుక, రజని గౌడ్, వెంకట నర్సయ్య,, బడుగుల నాగార్జున, ప్రభాకర్ రజక