భవిష్యత్ తరాల కోసం అప్రమత్తంతో మెలిగి రైల్వే సాధన కోసం ముందుకు రావాలలి

Aug 28, 2026 - 16:20
Aug 28, 2026 - 16:30
 0  0

సూర్యాపేట, 28 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట మీదుగా బుల్లెట్ ట్రైన్ వేయాలని గత 14 రోజులుగా సూర్యాపేట జిల్లా కేంద్రంలో రైతు బజార్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం దగ్గర జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు ఈరోజు 15వ రోజుకు చేరింది. ఈరోజు అఖిల భారత రైతు సంఘం నాయకులురైతులు అఖిల భారత రైతు సంఘం జిల్లా అధ్యక్షులు మల్లు నాగార్జున రెడ్డి జిల్లా సెక్రెటరీ శంకర్ రెడ్డి తదితరులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు వీరికి మాల మహానాడు తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు సూర్యాపేట జిల్లా బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి తల్లమల్ల హసేన్ శుభాకాంక్షలు తెలిపి సంఘీభావం ప్రకటించారు ఈ సందర్భంగా హసేన్ మాట్లాడుతూ బుల్లెట్ ట్రైన్ సూర్యాపేట మీదుగా తీసుకురావాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు బుల్లెట్ ట్రైన్ రైలు మార్గం సూర్యాపేట జిల్లా ప్రజల హక్కుని ఈ మార్గం అన్ని వర్గాల ప్రజలందరికీ ప్రయోజనం కలుతుందని రైల్వే శాఖకు ఆదాయం కూడా ఎక్కువ సంఖ్యలో సమకూరుస్తుందని అన్నారు సూర్యాపేట ప్రజలు తమ హక్కుల సాధనలో పోరాట చరిత్ర కలిగిన గొప్ప యోధులని అలాంటి పోరాట యోధులు స్ఫూర్తితో రాజ్యాంగం కల్పించిన హక్కుల సాధనలో శాంతియుత పోరాటంలో సబ్బన్న వర్గాలు బుల్లెట్ ట్రైన్ సాధన కోసం గత 40 నెలలుగా పోరాటం చేస్తున్నారని కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పటివరకు కూడా చీమకుట్టినట్లు లేదని ఆవేదన వ్యక్తం చేశారు కొందరి స్వార్థ ప్రజలను కోసం గతంలో ఇచ్చిన బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ను మార్చే కుట్ర జరుగుతుందని ఆ కుట్రలను ఛేదించుటకు ప్రజలందరం భవిష్యత్ తరాల కోసం అప్రమత్తంతో మెలిగి రైల్వే సాధన కోసం ముందుకు రావాలని కోరినారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333