రాష్ట్రంలో భూములను కొల్లగొడుతున్నారు

Aug 30, 2026 - 20:31
Aug 30, 2026 - 20:38
 0  1

యాదాద్రి భువనగిరి జిల్లా: తుంగతుర్తి నియోజకవర్గం:

మోత్కూర్, 31 ఆగస్టు 2026 తెలంగాణవార్త రిపోర్టర్:- మోత్కూర్ మండలం దాచారం గ్రామంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్, వారి వెంట రాష్ట్ర నాయకులు నేవూరి ధర్మేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు, మాజీ మార్కెట్ చైర్మన్లు, మాజీ ఎంపీపీ లు, సర్పంచ్ లు, కౌన్సిలర్ల, మాజీ సర్పంచ్ లు, మాజీ ఎంపీటీసీ లు, గ్రామ శాఖ అధ్యక్షులు, నాయకులు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే డా.గాదరి కిశోర్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఇద్దరు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు రేవంత్, పొంగులేటి కలిసి పాలన చేస్తున్నారు. రాష్ట్రంలో భూములను కొల్లగొడుతున్నారు. రేవంత్ కు పాలనపై కనీస అవగాహన లేదు.. ఓత్తి ఆఫ్ నాలెడ్జ్ వ్యక్తి రేవంత్ రెడ్డి. అడ్డగోలిగా GO97 తెచ్చి  పాలిటెక్నిక్ విద్యను సర్వ నాశనం చేసాడు. పాలిటెక్నిక్ విద్యార్థులు బీటెక్ లోకి వెళ్లకుండా నిషేధం విధించాడు రేవంత్ రెడ్డి. ఫ్యూచర్ సిటీని నిర్మిస్తా అని ఫగ్గాలు కొడుతుండు..22A తో రాష్ట్రంలో కోటి 16 లక్షల ఎకరాలను నిషేధిత జాబితాలో పెట్టిన  మూర్ఖుడు ఈ రేవంత్ రెడ్డి. 22A పెరు చెప్పి అడ్డగోలుగా లంచాలు తింటున్నారు.. పేదలను ఎడిపిస్తున్నారు. రేవంత్ కనిపడితే ఉరికించి కొడతారు పేదలు. చదువు రాని అవగాహన లేని మూర్ఖపు సీఎం రేవంత్ రెడ్డి. ఈయన ముఖానికి అమెరికా పోయి యూనివర్సిటీ లతో చర్చలు జరుపుతాడు అంట అందరూ నవ్వుకుంటున్నారు. చంద్రబాబు రేవంత్ కలిసే రాష్ట్ర రైతులకు మరణశాసనం రాస్తున్నారు.

మళ్ళీ జన్మలో కాంగ్రెస్ కు ఓటేయ్యరు రైతులు. కాంగ్రెస్ అంటేనే దుమ్మెత్తి పోస్తున్నారు. 100 రోజుల్లో హామీలు నెరవేరుస్తామని, వెయ్యి రోజులైనా  ఒక్కటి కూడా అమలు చేయలేదు రేవంత్ రెడ్డి.అందుకే వారం రోజుల పాటు నిరసన కార్యక్రమాలు చేసి ప్రజలను జాగృతం చేస్తాం, సెప్టెంబర్ 2 నాడు తుంగతుర్తి లో భారీ నిరసన ధర్నా  నిర్వహిస్తున్నాం. సెప్టెంబర్ 3 నాడు మిర్యాలగూడ కెటిఆర్ వ్యవసాయ విద్వాంసం పై నిర్వహిస్తున్న  నిరసన సభలో పాల్గొంటారు. కృష్ణా నీటిని చంద్రబాబు ప్రభుత్వం దోచుకొని పోతున్నది... శ్రీశైలం నుండి, సాగర్ నుండి దౌర్జన్యం చేస్తూ నీటిని తోడుకొని పోతున్నారు.. అయిన జిల్లా మంత్రులకు సోయి లేదు. కోమటిరెడ్డి సాగర్ నిండిన నీళ్లు ఇయ్యమ్ అని ప్రకటించాడు. సాగర్ ఆయకట్టు రైతాంగం కోమటిరెడ్డి కి కర్రుకాల్చి వాత పెట్టాలి.. జిల్లా మంత్రులు చరిత్ర హీనులుగా మిగిలిపోయారు. సాగర్ ఎడమ రైతాంగం తరుపున మిర్యాలగూడలో భారీ ధర్నా చేస్తున్నాం. దానికి కెటిఆర్ హాజరవుతారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333