తిరుమలగిరిలో అతివేగంతో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

Aug 27, 2026 - 23:11
Aug 27, 2026 - 23:47
 0  6
తిరుమలగిరిలో అతివేగంతో ఇంట్లోకి దూసుకెళ్లిన కారు

  తిరుమలగిరి 28 ఆగస్టు 2026 తెలంగాణ వార్త రిపోర్టర్:-  అతి వేగంతో దూసుకెళ్లిన ఓ కారు బీభత్సం సృష్టించింది. అదుపుతప్పి డివైడర్‌ను దాటి ఇంట్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో ts 25 f 8650 నెంబర్ గల కారులో ప్రయాణిస్తున్న మైనర్ ఆరుగురు యువకులకు తీవ్ర గాయాలై, పరిస్థితి విషమంగా మారింది. వివరాలకు వెళితే సూర్యాపేట జిల్లాలోని తిరుమలగిరి మండల కేంద్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. మద్యం మత్తులో జయశంకర్ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం పెద్ద కోమటిపల్లి గ్రామానికి చెందిన ఆరుగురు యువకులు యాదాద్రి భువనగిరి జిల్లా రాయగిరిలో జరిగిన ఓ వివాహ కార్యక్రమానికి హాజరై కారులో తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. మార్గమధ్యలో తిరుమలగిరి మండల కేంద్రానికిి రాగానే కారు అదుపుతప్పి పల్టీలు కొట్టి రోడ్డు పక్కనే ఉన్న ఇంట్లోకి దూసుకెళ్లింది ఈ ప్రమాదంలో షట్టర్ పూర్తిగా ధ్వంసం అయ్యింది ప్రమాద సమయంలో ఎవరు అక్కడ ఉండకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు కారులో ప్రయాణిస్తున్న యువకులు చరణ్ ,నవీన్, సిద్దు ,వినయ్, అజయ్, వినయ్ లకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికుల సమాచారంతో వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం తొర్రూరు ఆసుపత్రికి తరలించారు అనంతరం స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు.

జేరిపోతుల రాంకుమార్ తిరుమలగిరి విలేకరి మరియు తుంగతుర్తి నియోజకవర్గం ఇన్చార్జి