సీఎం సహాయనిధి చెక్కును అందజేసిన యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బైరెడ్డి సందీప్ రెడ్డి

అడ్డగూడూరు 20 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– అడ్డగూడూరు మండల కేంద్రంనికి చెందిన ఆసర్ల వెంకన్న అనే వ్యక్తి కొద్దిరోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు.ఈ విషయం మండల యువజన అధ్యక్షుడు బైరెడ్డి సందీప్ రెడ్డి తెలుసుకొని తెలంగాణ రోడ్డు రవాణా శాఖ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తెలపగా స్పందించి వారి ద్వారా 60 వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును మంజూరు చేయించారు.ఈ సందర్భంగా బైరెడ్డి సందీప్ రెడ్డి మాట్లాడుతూ..అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన ప్రతి నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ ఆర్థిక భరోసా కల్పిస్తుంది అని అన్నారు.ఈ పధకం కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తుంది అన్నారు.మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి లబ్ధిదారుడు కృతజ్ఞతలు తెలిపి వారికి రుణపడి ఉంటానని అన్నారు.