వాహన తనిఖీ నిర్వహిస్తున్న అడ్డగూడూరు పోలీస్ బృందం

Jan 5, 2025 - 09:34
Jan 5, 2025 - 09:35
 0  180
వాహన తనిఖీ నిర్వహిస్తున్న అడ్డగూడూరు పోలీస్ బృందం
వాహన తనిఖీ నిర్వహిస్తున్న అడ్డగూడూరు పోలీస్ బృందం

అడ్డగూడూరు 04 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:-

యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలం పరిధిలోని అడ్డగూడూరు స్టేజి పాయింట్ వద్ద అడ్డగూడూరు పోలీసు బృందం డ్రంక్ అండ్ డ్రైవ్ వాహన తనిఖీ నిర్వహించారు. ఏ ఒక్కరిని వదలకుండా వాహనాలను డ్రైవర్లను తనిఖీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్సై డి నాగరాజు ఆదేశాల మేరకు ఏఎస్ఐ ఈశ్వరయ్య ఆధ్వర్యంలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఏఎస్ఐ ఈశ్వరయ్య మాట్లాడుతూ..హెల్మెట్ ధరించడం వల్ల వాహన కారుడుకి అనుకోని సంఘటన సంభవిస్తే ప్రాణాని రక్షించుకోవడానికి హెల్మెట్ కాపాడుతుందని వాహనదారుడు బయటికి వెళ్ళేటప్పుడు సరైన పత్రాలతో (లైసెన్సు,ఆర్ సి, ఆధార్ కార్డ్)తో పాటు వాహనానికి సంబంధించిన వివిధ పత్రాలు వాహనదారుడు రోడ్డుపైకి వెళ్లేటప్పుడు తన వద్ద ఉంచుకోవాలని అన్నారు.రోడ్డుపై వెళ్లే వాహనదారుడు సవ్యంగా గమ్యానికి చేరేలా చూడడమే మా బాధ్యతగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ రజినీకాంత్,రాజు,విజయ్ ఉన్నారు.