వెల్టూర్ గ్రామంలో ఘనంగా గణనాథుని నవరాత్రులు
అన్నప్రసాద వితరణ దాత కురువ శాంతమ్మ చిన్న మల్లయ్య
చిన్నంబావి మండలం తెలంగాణ వార్త : వెల్టూర్ గ్రామంలో ఆ ఆది దేవుడు విఘ్నేశ్వరుని పూజలో పాల్గొని, అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించిన కురువ శాంతమ్మ చిన్న మల్లయ్య.వెల్టూరు గ్రామంలో గ్రామ భవాని మాత యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర భవాని మాత యూత్ సభ్యుల ఆహ్వానం మేరకు పూజలో పాల్గొనడం జరిగినది.గణేష్ నవరాత్రుల సందర్భంగా ఈరోజు వెల్టూరు గ్రామ భవాని మాత యూత్ సభ్యులు ఏర్పాటు చేసిన వినాయక మండపం దగ్గర అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగినది. అన్నప్రసాద వితరణ దాతగా ముందుకు వచ్చినటువంటి వెల్టూరు గ్రామ వాస్తవ్యులు బిజెపి రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగినది.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, ఉమ్మడి గ్రామ పంచాయతీ తాజా మాజీ ప్రజాప్రతినిధులు, యువకులు, చిన్నారులు తదితరులు పాల్గొని, స్వామి వారి తీర్థ ప్రసాదాలను, అన్నప్రసాదాలను స్వీకరించడం జరిగినది.