అంగన్వాడి కేంద్రానికి పోషణ పక్షం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆసియా బేగం ఐసిడిఎస్
22-03-2024 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం:- చిన్నంబావి మండలంలో పెబ్బేరు ప్రాజెక్ట్ చిన్న దగడ సెక్టార్ చిన్నంబావిమండలంలో అంగన్వాడి కేంద్రములో పోషణ పక్షం కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్ ఆసియా బేగం, పంచాయతీ సెక్రటరీ వసంత , అంగన్వాడీ టీచర్ మంజుల, ఆధ్వర్యంలోగర్భవతులు బాలింతలు,పిల్లలు తదితరులు హాజరయ్యారు. మొదటఅన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. తదనంతరం పోషకాహారం యొక్క ప్రాముఖ్యత గురించి,తల్లిపాల ప్రాముఖ్యత గురించి వివరించారు. ఆకుకూరలు కూరగాయలు పండ్లు ఎక్కువగా తీసుకోవాలి అని, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవడంవల్ల పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా పుడుతుందని లేనియెడల పుట్టబోయే బిడ్డకు కానీ తల్లికి కానీ వచ్చే సమస్యల గురించి చక్కగా వర్ణించారు ,మొదటి 1000 రోజుల ప్రాముఖ్యత గురించి వివరించారు.