సెలవులలో ప్రైవేట్ పాఠశాలలు నడపవద్దని ఎంఈఓకి వినతి

Sep 20, 2025 - 21:08
 0  10
సెలవులలో ప్రైవేట్ పాఠశాలలు నడపవద్దని ఎంఈఓకి వినతి

ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన ఉప్పుల శాంతి కుమార్

మోత్కూర్ 20 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–  యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మున్సిపల్ కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో టెన్త్ క్లాస్ విద్యార్థులకు స్పెషల్ క్లాస్సెస్ పేరుతో ప్రైవేట్ పాఠశాలలు నడపడానికి ప్రయత్నిస్తున్న ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని  ఎంఈఓ గోపాల్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ మాట్లాడుతూ.. మోత్కూర్ మండలంలో యాదాద్రి జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వం ప్రకటించిన దసరా సెలవులలో కూడా స్పెషల్ క్లాస్ పేరుతో పాఠశాలలు నడపడానికి ప్రయత్నిస్తున్నారని అలాంటి పాఠశాలలపై ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తామని ఆయన హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర పండుగ జరుపుకునే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రభుత్వం సెలవులు ప్రకటిస్తే ప్రైవేట్ పాఠశాలలు మాత్రం మాకేం సంబంధం లేదు అన్నట్టుగా పాఠశాలలు నలిపి విద్యార్థులను మానసిక ఆవేదనకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. జిల్లా విద్యాశాఖ అధికారి కూడా ప్రైవేట్ పాఠశాలలపై నిఘా పెట్టి సెలవులలో పాఠశాలలు నడుపుతున్న పాఠశాలల అనుమతి రద్దు చేయాలని ఏఎస్ఎఫ్ జిల్లా కౌన్సిల్ పక్షాన డిమాండ్ వస్తున్నామని అన్నారు. 
సెలవులలో ప్రైవేట్ పాఠశాలలు నడిపిస్తే ఏఐఎస్ఎఫ్ విద్యార్థి సంఘంగా దాడులు చేస్తామని ఆదాడులకు విద్యాశాఖ అధికారులే బాధ్యత వహించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిప్పలపల్లి వంశీ కుమార్,చందు,సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333