సిపిఐ 100వ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి

Dec 21, 2024 - 18:30
Dec 22, 2024 - 12:57
 0  0
సిపిఐ 100వ శతాబ్ది ఉత్సవాలను జయప్రదం చేయండి

 21-12-2024 సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు భద్రాచలం డివిజన్ కార్యదర్శి కల్లూరి.వెంకటేశ్వరరావు చర్ల.. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ చర్ల మండల కౌన్సిల్ సమావేశం స్థానిక సిపిఐ ఆఫీస్ వద్ద నుప. తిరుపతిరావు అధ్యక్షతన జరిగింది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు భద్రాచలం డివిజన్ కార్యదర్శి కల్లూరి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ డిసెంబర్ 26న భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 99వ వార్షికోత్సవాలను గ్రామ గ్రామాన వాడవాడలా ఘనంగా నిర్వహించాలని పిలుపునిచ్చారు భారత కమ్యూనిస్టు పార్టీ 99 వ ఆవిర్భావ దినోత్సవం డిసెంబర్ 26న పెద్ద ఎత్తున సిపిఐ జెండాలు ఎగురవేసి జయప్రదం చేయాలి అన్నారు భారతదేశంలో 100 సంవత్సరాలు కలిగిన ఏకైక పార్టీ సిపిఐ అని దేశంలో పేద ప్రజల కోసం పోరాడిన పార్టీ సిపిఐ అని అన్నారు ఈ సందర్భంగా ఒక లక్ష మందితో నల్గొండలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 100వ ఆవిర్భావ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా భారీ బహిరంగ సభ నిర్వహించడం జరుగుతుందని దానికి మన భద్రాచలం డివిజన్ నుండి వందలాదిమంది కదిలి రావాలన్నారు లక్ష మందితో జరిగే 100 వ శతాబ్ది ఉత్సవాల ప్రారంభ బహిరంగ సభకు .సిపిఐ జాతీయ .ప్రధాన కార్యదర్శి. మాజీ ఎంపీ. డి. రాజా .గారు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగిస్తారు అన్నారు పేదల కోసం కూడు గుడ్డ నీడ కోసం నాటి నుండి నేటి వరకు స్వతంత్రోద్యమంలో కూడా పోరాడిన ఏకైక పార్టీ భారత కమ్యూనిస్టు పార్టీ అన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి వేలాదిమంది సిపిఐ కార్యకర్తలు రక్తతర్పణం చేశారన్నారు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నిర్వహించి లక్షలాదిమందికి భూమిని పంచిన చరిత్ర సిపిఐ దే.అన్నారు ప్రజా సమస్యల పైన పోరాటాలు అనునిత్యం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ .జిల్లా సమితి సభ్యులు అడ్డగర్ల .తాతాజీ .మండల. కార్యదర్శి .నూప.పోతయ్య .సీనియర్ నాయకులు .పాల్వంచ. రామారావు. నానుపల్లి. భద్రం. పోడియం. ఆదిలక్ష్మి. మల్లం. నాగేశ్వరరావు. ఉప్పులూరి. నాగరాజు. చల్లా. లక్ష్మీనారాయణ. కోటి .ముత్యాలరావు. కాకర్ల. అనసూయ. మోట్ల. ఆదిలక్ష్మి .మునిగేల .రామారావు నల్లూరు .కృష్ణార్జునరావ్. కల్లూరి .సీతారాములు. పదం.రాజు కుంజ .లక్ష్మయ్య. రామయ్య. మడకం శ్రీను. నూప.రాము .మాడవి.దేవయ్య మడివి. బాలరాజు .పోడియం.సీతయ్య . పర్షిక .శంకర్. తదితరులు పాల్గొన్నారు