ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

Jan 3, 2025 - 16:14
Jan 3, 2025 - 17:09
 0  11
ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- ఘనంగా మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్వర్గీయ సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించిన నేపథ్యంలో స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆత్మకూర్ ఎస్ నందు మహిళా ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వి.శ్రవణ్ కుమార్ గారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళల అభివృద్ధికి,అభ్యున్నతికి చేసిన సేవలను కొనియాడారు. ముఖ్య అతిథులుగా మండల విద్యాధికారి శ్రీ ధారాసింగ్ గారు పాఠశాల కమిటీ చైర్పర్సన్ శ్రీమతి జ్యోతి గార్లు పాల్గొన్నారు. MEO గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సావిత్రిబాయి పూలే జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినోత్సవం గా ప్రకటించడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు ఊర్మిళ,శిరీష, మల్లీశ్వరి,శ్రీదేవి,అజ్మతునిస బేగం, మహాలక్ష్మి, వనజ, శోభలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది సుదర్శన్ రెడ్డి, చంద్రశేఖర్,అన్నపూర్ణ చారి, మల్లారెడ్డి,రఘు,రమేష్,చౌదర్ రెడ్డి,జగన్,సురేందర్,రమేష్ పాల్గొన్నారు. ప్రధానోపాధ్యాయులు ZPHS ఆత్మకూర్ (S)