పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రైతులు ఆర్థికంగా ఎదుగుతారు - సర్పంచ్ శిరీష

Jan 12, 2026 - 17:17
 0  7
పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రైతులు ఆర్థికంగా ఎదుగుతారు - సర్పంచ్ శిరీష
పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే రైతులు ఆర్థికంగా ఎదుగుతారు - సర్పంచ్ శిరీష

నూతనంగా పశువుల స్టాండ్ ప్రారంభించిన...

పెద్దపల్లి గ్రామ సర్పంచ్ అల్వాల శిరీష రాజశేఖర్ రెడ్డి..

 జోగులాంబ గద్వాల 12 జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  మల్దకల్.  మండల పరిధిలోని పెద్దపల్లి గ్రామంలో పశుసంవర్ధక శాఖ పశువైద్య శిబిరం వద్ద నూతనంగా పశువుల స్టాండ్ సర్పంచ్ శిరీష అల్వాల రాజశేఖర్ సహకారంతో ఏర్పాటు చేసిన మండల పశు వైద్య అధికారులు డాక్టర్ ఉష, డాక్టర్ వినయ్ కుమార్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ కే.శిరీష అల్వాల రాజశేఖర్ రెడ్డి పాల్గొని పశువుల స్టాండ్ ప్రారంభించారు..ఈ సందర్భంగా *డాక్టర్ ఉష మాట్లాడుతూ పశువులకు  గ్రామీణ ప్రాంతాలలో నిర్వహిస్తున్న పశు వైద్య శిబిరాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలని, 47 పశువులకు చికిత్స,15దూడలకు నట్టల నివారణ మందులు త్రాగించటం జరిగిందని,40 గొర్రెలు మరియు మేకలకు 50 కోళ్లకు మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు.సకాలంలో పశువుల ఎదను గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయించాలని,ఏడాదికి ఒక పశువుకి ఒక దూడ వచ్చేలా చూసుకోవాలని,కృత్రిమ గర్భధారణ వల్ల గ్రామాలలో మేలు జాతి పశు సంపద పెరిగి తద్వారా తలసరి పాల ఉత్పత్తి పెరుగుతుందని డాక్టర్ ఉష*పాడి రైతులకు చెప్పడం జరిగినది.*గ్రామ సర్పంచ్ కే శిరీష రాజశేఖర్ రెడ్డి పశు పోషకలతో మాట్లాడుతూ పశువులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆర్థికంగా అభివృద్ధి సాధ్యమవుతుందని, పశువుల సంరక్షణలో పోషకలు తగ్గిన శ్రద్ధ చూపాలన్నారు.ఇలాంటి ప్రత్యేక పశు వైద్య శిబిరాలను పశుపోషకులు సద్వినియోగం చేసుకోవాలి అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ లక్ష్మి నరసింహ, వార్డు మెంబెర్స్, వెంకటేష్, పరుశురాముడు, సవారీ,గ్రామస్తులు, శివన్న, గోపాల్, ఉల్వ నర్సింహా,శ్రీశైలం, కిష్టన్న, నర్సింలు,ఎర్రన్న, నడిపన్న,ప్రభాకర్, ప్రశాంత్,నాగరాజు, రమేష్, ఓంశంకర్, పశువైద్య సిబ్బంది ఎం. రాముడు, మధు తదితరులు పాల్గొన్నారు..

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333