సంపూర్ణ అభియాన్" ప్రోగ్రాం నందు బాధ్యతతో పని చేయాలి డిఎంహెచ్వో
డాక్టర్ ఎస్.కె సిద్ధప్ప.
జోగులాంబ గద్వాల 26 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. జిల్లావైద్య ఆరోగ్యశాఖ కాన్ఫరెన్స్ కార్యాలయంలో.. ఈరోజు సంపూర్ణ అభియాన్, కార్యక్రమంలో భాగంగా అందరూ బాధ్యతతో పని చేయాలని సెప్టెంబర్ నెలకి వరకు నిర్దేశించిన.. మరియు ఎన్సీడీ ప్రోగ్రామ్ సంబంధించిన బిపి షుగర్ ఏఎన్ఎం స్క్రీనింగ్ 30 సంవత్సరములు పైబడిన వారందరికీ సెప్టెంబర్ నెలాఖరి వరకు క్వాలిటీ స్క్రీనింగ్ చేసి పూర్తిచేయాలని.. వివిధ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ నందు పనిచేస్తున్నాను MLHP సిబ్బంది మరియు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు.. దాదాపు 70 మందితో సమావేశమై ఆరోగ్య కార్యక్రమాలను వివరంగా తెలపడం జరిగింది... మొత్తం టార్గెట్.. 40865.....30 సంవత్సరములు పైబడిన వారు ఉండగా అందులో..5846.. వారికి మాత్రమే స్క్రీనింగ్ జరిగిందని.. వివిధ గ్రామాల యందు మిగిలి ఉన్న జనాభాను..35019. మందికి స్క్రీనింగ్ జరపాలని, డి .ఎం.హెచ్.ఓ తెలిపారు.. ప్రతివారం అన్ని సెంటర్ల యందు..4375.. స్క్రీనింగ్ జరిపి ఆఫ్లైన్ మరియు ఆన్లైన్లో ఎంట్రీ చేయవలసి ఉంటుందని, ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డును కూడా క్రియేట్ చేయాలని సూచించారు.