కామ్రేడ్ నల్ల నరసింహులు జయంతి వేడుకలను జయప్రదం చేయండి
తిరుమలగిరి 03 నవంబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:
ఈనెల 5న జనగామ జిల్లా దేవరుప్పుల మండలం సీతారాంపురం గ్రామంలో నిర్వహించే కామ్రేడ్ నల్ల నరసింహులు 32వ వర్ధంతి వేడుకలు జయప్రదం చేయాలని మన ఆలోచన సాధన సమితి మాస్ వ్యవస్థాపక అధ్యక్షులు కటకం నర్సింగ్ రావు నేత అన్నారు ఆదివారం నాడు తిరుమలగిరి మండల కేంద్రంలోని పెన్షనర్ భవనంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నల్ల నరసింహులు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో సిపిఐ పార్టీ నాయకుడిగా ప్రజల విముక్తి కోసం ప్రాణాలు లెక్కచేయకుండా ఉద్యమించిన యోధుడు అని ఆయన అన్నారు తెలంగాణ విముక్తి పోరులో పలుమార్లు పోలీసులకు పట్టుబడిన వెన్ను చూపని ధీరుడు అని ఆయన చెప్పారు న్యాయస్థానంలో మూడుసార్లు ఉరిశిక్ష విధించిన భయపడకుండా తన వాదనను అత్యంత చాకచక్యంగా ధైర్యంగా వినిపించి న్యాయస్థానాల చేతనే తెలంగాణ టైగర్ జనగామ సింహం పిలిపించుకొనబడిన వీరుడు అని ఆయన చెప్పారు నరరూప రాక్షసుడు విసునూరు దేశ్ముఖ్ రేపాక రామచంద్రారెడ్డి అతని తల్లి జానకమ్మ దొరసాని కబంధ హస్తాల నుండి జనగామ దేవరుప్పుల ప్రాంత ప్రజలకు విముక్తి కోసం సర్వం ధారపోసిన త్యాగశీలి నల్ల నరసింహులు అని ఆయన చెప్పారు అలాంటి మహనీయుని వర్ధంతి వేడుకలను ఈ ప్రాంతంలో మనం నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని అలాంటి మహనీయుని వర్ధంతి సభను ఈ ప్రాంతం నుండి వేలాదిగా వచ్చి జయప్రదం చేయాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్ కొత్తగట్టు మల్లయ్య బీసీ సంఘం రాష్ట్ర సెక్రెటరీ చంద్రశేఖర్ గౌడ్ బీసీ సంఘం రాష్ట్ర నాయకులు చేను శ్రీనివాసులు మరియు రాష్ట్ర నాయకులు ఆవుల వెంకటేశం యాదవ్ జిల్లా నాయకులు గిలగత్తుల రాము గౌడు రజక సంఘం మండల అధ్యక్షుడు పులిమామిడి సోమయ్య పద్మశాలి సంఘం మండల అధ్యక్షుడు చింతకింది మురళి మహేశ్వరం జయచందర్ కందుకూరి ప్రవీణ్ మండల బీసీ సంఘం నాయకులు మెతుకు నరసింహ పోరెల్ల విప్లవ కుమార్ మరియు తదితరులు పాల్గొన్నారు