చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి
అడ్డగూడూరు 02 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలంలోని మానాయాకుంట గ్రామానికి చెందిన శారీరక విద్యా ఉపాధ్యాయుడు (పిఈటి)సూరారపు వెంకన్న తండ్రి సాయిలు హైదరాబాద్‌లోని పల్లవి మోడల్ స్కూల్లో జరిగిన తెలంగాణ రోప్ స్కిప్పింగ్ జనరల్ బాడీ సమావేశంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు.గ్రామీణ స్థాయి నుంచి అనేకమంది విద్యార్థులను రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలకు తీసుకెళ్లి ప్రోత్సహించడంలో వెంకన్న చూపిన కృషి ప్రశంసనీయమైంది.ఆయన ఎన్నిక సందర్భంగా కుటుంబ సభ్యులు,స్నేహితులు, సహచర ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు శ్రేయోభిలాషులు ఆనందం వ్యక్తం చేస్తూ.. హృదయపూర్వక అభినందనలు తెలిపారు.