కొప్పునూరు గ్రామంలో పంచాయతీ సెక్రెటరీ ఆధ్వర్యంలో పారిశుద్ధ కార్యక్రమం
01-11-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం : చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన కొప్పునూర్ గ్రామంలో పారిశుద్ధ్య కార్యక్రమని విజయవంతం చేశారు. చిన్నంబావి మండలం పరిధిలోని కొప్పునూరు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో శనివారం పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో గ్రామంలోని ప్రధాన వీధులు, మురికివాడలు, సైడ్ కాలువలను శుభ్రపరిచారు. మురికినీరు నిల్వ ఉండే ప్రదేశాలలో బ్లీచింగ్ పౌడర్ చల్లి శానిటేషన్ పనులు చేపట్టారు.గ్రామంలో దోమల పెరుగుదలతో పాటు సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కార్యదర్శి తెలిపారు. పరిశుభ్రత పట్ల ప్రతి ఇంటి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా పంచాయతీ నిర్దేశించిన ప్రదేశాల్లో వేయాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ సిబ్బంది, స్వచ్ఛదారులు, మహిళా సంఘ సభ్యులు చురుకుగా పాల్గొన్నారు. గ్రామ ప్రజలు పరిశుభ్రమైన వాతావరణం సృష్టించేందుకు ముందుకు రావాలని కార్యదర్శి పిలుపునిచ్చారు.