బదిలీపై వెళ్లిన వెళ్లిన ఉపాధ్యా యు లకు ఘన సన్మానం.

Jul 26, 2024 - 18:34
 0  29
బదిలీపై వెళ్లిన వెళ్లిన ఉపాధ్యా యు లకు ఘన సన్మానం.
బదిలీపై వెళ్లిన వెళ్లిన ఉపాధ్యా యు లకు ఘన సన్మానం.

జోగులాంబ గద్వాల 26 జూలై 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:-  ఇటిక్యాల.  మండల పరిధిలో నీ పెద్దదిన్నె  గ్రామాలలో నీ ప్రాథమికొన్నత పాఠశాల లో గత కొన్ని సంవత్సరాలనుండి విద్యార్థుల కు విద్య బుద్ధులు నేర్పినా గురువులు వృత్తి ధర్మం లో భాగంగా వేరే పాఠశాలలకు బదిలీ పై  ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరావు మల్దకల్ కు, స్వాములు పూడూర్ కు, అన్వార్ తిమ్మాపూర్ కు బదిలీ పై వెళ్లారు. బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులకు ప్రధానోపాధ్యాయులు కరేందర్ ఆధ్వర్యంలో శుక్రవారం వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.ఈసందర్బంగా గత కొన్ని సంవత్సరాలనుండి పాఠశాల కు వారు చేసిన సేవలు,పాఠశాల అభివృద్ధికి వారు చేసిన కృషి నీ గ్రామస్తులు కొనియాడారు. బదిలీ పై వెళ్లిన ప్రధానోపాధ్యాయులు నాగేశ్వరావు మాట్లాడుతూ, గ్రామంలో ఉన్న ప్రజ లందరి సహాయ సహకారం తో తమ వంతు గా వృత్తి ధర్మ నీ పాటి స్తూ విద్యార్థులు కు భోదించడం జరిగింది అన్నారు. అలాగే గత పది సంవత్సరాలనుండి పాఠశాలలో పనిచేసి విద్యార్థులను,  గ్రామస్తులతో ఉన్నా అనుబంధం ప్రేమ అనురాగాలు స్థిరస్థాయిగా నిలిచి పోతాయి అన్నారు. అనంతరం బదిలీ పై వెళ్లిన ఉపాధ్యాయులను నూతన ఉపాధ్యాయులు, విద్యార్థులు శాలువ పూలమాల తో ఘనంగా సన్మానించారు, అలాగే గ్రామ మాజీ సర్పంచ్ ల సంఘం  తాలుక అధ్యక్షులు, తాజా మాజీ వైస్ ఎం పి పి భర్త శ్రీనాథ్ రెడ్డి, మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి, మాజీ  విద్య కమిటీ చైర్మన్ వెంకన్న అమ్మ ఆదర్శ పాట శాల చైర్మన్ మహేశ్వరీ రామూర్తి లు శాలువ పూలమాల తో సన్మానం చేశారు ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీరామ్, హుసేన్, రావులచెర్వు ఉపాధ్యాయులు రాజశేఖర్,గ్రామ పెద్దలు రాంభూపాల్ రెడ్డి, యూవకులు వెంకటేష్ రెడ్డి నాగరాజ్, శేఖర్ రెడ్డి, విద్యార్థులు గ్రామస్తులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333