కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ధర్మవరం బీసీ బాలుర వసతి గృహంలో 40 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్
ఇద్దరు పరిస్థితి విషమం
తక్షణమే కఠినమైన చర్యలు తీసుకొని వార్డెన్ ను సస్పెండ్ చేయాలి
BRSV రాష్ట్ర నాయకులు మరియు జోగులాంబ గద్వాల జిల్లా కోఆర్డినేటర్ కురువ పల్లయ్య
జోగులాంబ గద్వాల 1 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి అలంపూర్ నియోజకవర్గం ఎర్రవల్లి మండలంలోని ధర్మవరం బీసీ బాలుర గృహంలో ఫుడ్ పాయిజన్ వల్ల 40 మంది విద్యార్థులకు తీవ్రమైన అస్వస్థత వెంటనే ఆసుపత్రులకు తరలించారు. రేవంత్ రెడ్డి సర్కార్ వల్ల రాష్ట్రంలో వసతి గృహాలలో ఫుడ్ పాయిజన్లు ఆత్మహత్యలు జరగడం దురదృష్టకరం. బడుగు బలహీన వర్గాలు చదువుకునే వసతి గృహాల పైన పూర్తిగా వివక్ష చూపుతూ, నాణ్యమైన ఫుడ్ ను పెట్టలేని దుర్మార్గమైనా రేవంత్ రెడ్డి సర్కార్ అని మండిపడ్డారు. తక్షణమే ఆ విద్యార్థులకు మెరుగైన చికిత్స అందించాలని డిమాండ్ చేశారు.