లెప్రసీ నెలవారి సమీక్ష సమావేశం. డి ఎం హెచ్ ఓ డాక్టర్ సిద్దప్ప.
జోగులాంబ గద్వాల 26 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- గద్వాల. ఈరోజు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నూతన డిఎంహెచ్ఓ డాక్టర్ సిద్దప్ప ఆధ్వర్యంలో లెప్రసీ (leprosy)నెలవారి సమీక్ష నిర్వహించటం జరిగింది .ఈ యొక్క సమీక్ష సమావేశంలో డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ....
ఈ యొక్క లెప్రసీ కార్యక్రమం నిరంతర ముగ నిర్వహించాలని తెలియజేయడము జరిగినది. ఇంటింటి సర్వే లో భాగంగా మొద్దు బారిన మచ్చలు, రాగి రంగులో ఉన్న మచ్చలు చర్మంపై ఉబ్బి ఉన్న మచ్చలు ఉన్నట్లయితే దగ్గరలోని PHC లకు పంపగలరని తెలియజేయడం ఈ యొక్క సమావేశంలోPHC ల వారిగా వివరములు అడిగి తెలుసుకోవడం జరిగినది. ప్రస్తుతము 10 రోజుల నుండి వర్షాలు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నందువలన సీజనల్ వ్యాధులు డెంగ్యూ, మలేరియా, చికెన్ గున్యా, టైఫాయిడ్ ,మొదలగు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని . ప్రతిరోజు మీ మీ గ్రామాల పరిధిలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రతిరోజు జిల్లా అధికారులకు సర్వే రిపోర్ట్ సమర్పించాలని తెలియజేయడం జరిగినది. ఈ యొక్క కార్యక్రమంలో రామకృష్ణ CHO . మధుసూదన్ రెడ్డి HE. నరేందర్ MPHEO. శివన్న S.U.O, వరలక్ష్మి, I/C DPHNO. నరసయ్య మరియు నోడల్ పర్సన్స్ పాల్గొనడం జరిగినది.