ఇందిరమ్మ ఇళ్లకు కావలసిన సామాగ్రి యజమాలతో సమావేశం
అడ్డగూడూరు 01 నవంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆదేశాల అనుసరించి ఎంపీడీవో శంకరయ్య అధ్యక్షతన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సిమెంటు స్టీల్ ఇటుకలు మొదలైన సామాగ్రిని పంపిణీ చేసే యజమానుదారులతో సమావేశం నిర్వహించడం జరిగింది.ఇట్టి సమావేశంలో రేట్లను అదనంగా పెంచకుండా కేవలం అనుమతించిన రేట్ల పరిధిలోనే అమ్మకాలు జరపాలని తెలియజేయడం జరిగింది.ఇట్టి సమావేశంలో తహశీల్దార్ శేషగిరిరావు, ఎంపీఓ ప్రేమలత, ఎఎస్ఐ ఈశ్వర్,పంచాయతీ కార్యదర్శులు,సప్లయర్లు తదితరులు పాల్గొన్నారు.