శ్రీ ప్రహర్షా దేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

Sep 17, 2025 - 19:38
 0  15
శ్రీ ప్రహర్షా దేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం

పేద కుటుంబలకు నిత్యవసర సరుకుల పంపిణీ 

బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య

 నాగర్ కర్నూల్ జిల్లా జనరల్ సెక్రటరీ జగ్గారి శ్రీధర్ రెడ్డి 

 చిన్నంబావి మండల అధ్యక్షులు బొగ్గు కుర్మయ్య

 చిన్నంబావి మండల ఎస్సీ మోర్చా అధ్యక్షులు కత్తి జానీ 

 చిన్నబావి మండలం తెలంగాణ వార్త : ప్రధాన మంత్రి 75వ జన్మదిన వేడుకల సందర్భంగా శ్రీ ప్రహర్షా దేవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సేవా కార్యక్రమానికి ట్రస్ట్ చైర్మన్, రాష్ట్ర బిజెపి నాయకులు కురువ చిన్న మల్లయ్య దంపతులు ఆధ్వర్యం వహించారు. వెల్లటూరు గ్రామంలో నివసిస్తున్న దాదాపు 100 పేద కుటుంబాలకు తొమ్మిది రకాల నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేశారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల లో నిరుపేద కుటుంబాలకు కూడా ట్రస్ట్ ద్వారా  పంపిణీ చేస్తామని అన్నారు. సాధారణంగా కూలి పనుల ద్వారా జీవనం సాగించే కుటుంబాలు, ఇటీవల వర్షాల కారణంగా పనులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ సహాయం వారికి ఎంతో ఉపయుక్తమైంది. ఈ సందర్భంగా రాష్ట్ర బిజెపి నాయకులు కురువ చిన్న మల్లయ్య మాట్లాడుతూ సాధారణ రోజుల్లోనే రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి ఉన్న పేద కుటుంబాలు, ఇటీవలి భారీ వర్షాల కారణంగా మరింత ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి కుటుంబాలకు అండగా నిలవడం మా సామాజిక బాధ్యతగా భావిస్తున్నాం. పేద ప్రజలు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. కొందరికైనా కొంతైనా చేయగలిగితే అది నిజమైన సేవగా భావిస్తాం అని తెలిపారు. గ్రామ ప్రజలు మాట్లాడుతూ బిజెపి పార్టీ రాష్ట్ర నాయకులు కురువ చిన్న మల్లయ్య, చేస్తున్న సేవలు, శ్రీ ప్రహర్ష చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు నిరుపేదలకు ఆపన్న హస్తంగా నిలుస్తున్నాయని ఇలాంటి ముందు ముందు ఎన్నో చేయాలని గ్రామ ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను చేపడతామని ట్రస్ట్ చైర్మన్ కురువ చిన్న మల్లయ్య హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చిన్నంబావి మండల అధ్యక్షుడు, సీనియర్ నాయకులు వివిధ గ్రామాల కార్యకర్తలు మరియు పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333