ఎస్సీ బాలుర హాస్టల్లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం.

Sep 17, 2025 - 19:37
 0  8
ఎస్సీ బాలుర హాస్టల్లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం.

చిన్నంబావి మండలం తెలంగాణ వార్త : చిన్నంబావి  మండల పరిధిలోని కొప్పునూర్ ఎస్సీ బాలుర హాస్టల్లో బుధవారం ఉదయం ప్రేయర్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం ఘనంగా జరిగింది.ఈ సందర్బంగా హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మాట్లాడుతూ - మన తెలంగాణకు ప్రజాపాలన వచ్చినందుకు మనందరం గర్వపడాలి అన్నారు.ప్రజాపాలన వచ్చిన శుభసoదర్బంగా జాతీయ జెండా ఎగురావేశారు. ఈ సందర్బంగా విద్యార్థులకు,ప్రజలకు,వర్కర్స్ కు అందరికి తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్బంగా శుభాకాంక్షలు తెలియజేశారు..అదే విధంగా ఈరోజు నిజాం నిరంకుశ పాలనపై తిరగబడి అమరులైన వీరులందరికి నివాళి అర్పించారు.ఈ విషయంలో అడుగడుగుణ తమ సహాయ,సహకారాలు అందించిన గౌరవనీయులు సర్దార్ వల్లభాయ్ పటేల్ను గుర్తుచేసుకున్నారు.ఈ కార్యక్రమంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ రవీందర్ రెడ్డితో పాటు విద్యార్థులు,గ్రామ ప్రజలు,వర్కర్స్ నరేష్,ఆంజనేయులు పాల్గొన్నారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333