కాలనీలో త్రాగునీటి కొరత
జోగులాంబ గద్వాల 28 నవంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: గద్వాల. జిల్లా కేంద్రంలోని పిల్లిగుండ్ల కాలనీలో గత ఐదు రోజులుగా కాలనీ ప్రజలకు త్రాగటానికి మిషన్ భగీరథ త్రాగునీళ్లు రాక ఇబ్బందులకు గురవుతున్నారు.సంబంధిత జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధుల దగ్గరకు ఎన్నోసార్లు కాలనీ సమస్యలను పరిష్కరించండి అని తెలిపిన ఫలితం శూన్యం.గత ఐదు రోజులుగా త్రాగటానికి మిషన్ భగీరథ నీళ్లు రావట్లేదు ఇట్టి విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకుపోయిన వారు పట్టించుకోవట్లేదని కాలనీవాసులు ఆవేదన చెందుతున్నారు.పట్టణంలో ఇలాంటి సమస్య ఏర్పడితే మరుసటి రోజే సమస్యను పరిష్కరిస్తారు.కానీ ఈ కాలనీ పై ఎందుకంత చిన్నచూపు.రోడ్డు సౌకర్యం లేదు నీరు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ఎలా తెచ్చుకోవాలి. ఇక్కడ ఎవరు అడిగే నాధుడు లేడు.మా కాలనీలో ఎన్నో సమస్యలు ఉన్నాయని తెలిపిన ప్రయోజనం శూన్యం.కనీసం త్రాగడానికి నీరు అన్నా వదులుతారు అనుకుంటే నీళ్లు కూడా వదలట లేదు. జోగులాంబ గద్వాల జిల్లా లో ఓ కలెక్టర్ కార్యాలయం ఉన్న పట్టణంలోనే త్రాగడానికి నీళ్లు లేక ప్రజలు అల్లాడిపోతున్న కూడా జిల్లాలో ఉన్న కలెక్టర్ దృష్టికి ఎన్నోసార్లు త్రాగడానికి నీళ్లు రావట్లేదని మీడియా ద్వారా తీసుకువెళ్లిన సంబంధిత అధికారులపై చర్య ఎందుకు తీసుకోవట్లేదు అని ప్రజలు చర్చించుకుంటున్నారు.
ఇట్టి విషయంపై మున్సిపల్ కమిషనర్ ను చరవాణి ద్వారా వివరణ కోరగా వారు పని చేయిస్తూనే ఉన్నాము తొందర్లోనే మీ కాలనీలోకి నిలువదళతామని కమిషనర్ జానకిరామ్ తెలిపారు.