సోదరసోదరి భావంతో విద్యార్థులకు ఆత్మీయ వీడ్కోలు
జోగులాంబ గద్వాల 11 మార్చి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి.
ఎర్రవల్లి. ఘనంగా ఎర్రవల్లి శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ (సీబీఎస్ఈ) స్కూల్ నందు 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు.
మీరు ఉదయాన్నే నిద్రలేచే అలవాటును అలవర్చుకోవాలి.
* చరవాణిలకు దూరంగా ఉండాలి. తల్లిదండ్రులను గురువులను మరియు పెద్దలను గౌరవించాలి ఆపై చదువులను ఇష్టంతో చదవాలి....
-పాఠశాల డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి
పునాది బలంగా ఉంటేనే నిర్మాణం అధిక బలంగా ఉండబోతుంది.
* చెడు వ్యసనాలకు దూరంగా ఉంటేనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది
-పాఠశాల చైర్మన్ శ్రీ గోవర్ధన్ రెడ్డి
స్నేహభావంతో బంధుత్వాలతో కలిసిమెలిసి ఉండడం వల్ల కలిగే లాభాలు అధికం.
* సమయం దొరికినప్పుడు తల్లిదండ్రులతో సొంత వ్యవసాయ పొలాలకు వెళ్ళండి పని భారం ఏంటో తెలుస్తుంది.
* క్రమం తప్పకుండా పాఠశాలకు వెళ్లినప్పుడే ఎప్పుడైనా పుస్తకాల పురుగు అవుతారు, సోషల్ మీడియా దూరంగా ఉండాలని విజ్ఞప్తి.
-పాఠశాల ప్రిన్సిపాల్ నందిని కేని
ఎర్రవల్లి మండల కేంద్రంలోని:
శ్రీ సరస్వతి ఇంటర్నేషనల్ (సీబీఎస్ఈ) స్కూల్ నందు ఘనంగా 10వ తరగతి పూర్తి చేసుకుని వెళ్తున్న శుభ సందర్భంలో జూనియర్స్ అందరూ కలిసి పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ సమయం దొరికినప్పుడు పుస్తకాలతో కుస్తీ పట్టాలి సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల ఉజ్వల భవిష్యత్తు కోల్పోతారని విద్యార్థులకు సూచనలు చేశారు.
మన పాఠశాల గురువులందరూ మంచి బోధన అందించి ఉన్నతమైన స్థానంలో ఉంచడం కొరకు వారి పడిన శ్రమ వర్ణనాతితం గురువుల స్థానం ఎప్పుడూ గొప్పదే అంటూ కొనియాడారు.
ఈ పదవ తరగతి విద్యాభ్యాసం అయిపోయి పై చదువులో కూడా చురుకుగా చదవాలి అంటూ హితబోధ చేశారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ శ్రీ వీర శ్రీనివాస్ రెడ్డి, చైర్మన్ శ్రీ వీర గోవర్ధన్ రెడ్డి, కరస్పాండెంట్ శ్రీమతి మధులిక రెడ్డి, ప్రిన్సిపాల్ నందిని కేని, ఉపాధ్యాయ బృందం వెంకటేష్, శ్వేత, సతీష్ కుమార్, సోమనాథ్, మహమ్మద్ రఫీ, నాగార్జున, అలిపిర, ఏనాథ్, సుమలత, హరిత, వర్గీస్, కిరణ్ కుమార్, అనిల్, పార్థసారథి, శ్రావణి, రూప, బాలకృష్ణ విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు పాల్గొన్నారు.