మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ""సూర్యాపేట జిల్లా ఎస్పీ కే నరసింహం ఐపిఎస్

మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు.
తెలంగాణ వార్త ప్రతినిధి రా వెళ్ళ : సరిహద్దు వెంట పటిష్టంగా ఉండాలి - సూర్యాపేట జిల్లా ఎస్పీ మంగళవారం రాత్రి జిల్లా ఎస్పీ నర్సింహ ఐపీఎస్ గారు మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ నందు నిర్వహిస్తున్న రిసెప్షన్ సెంటర్ ను పరిశీలించి రికార్డ్స్ తనిఖీ చేశారు. ఫిర్యాదుదారులకు భరోసా ఇచ్చేలా రిసెప్షన్ సెంటర్ పటిష్టంగా పనిచేయాలి ప్రతి విషయాన్ని రికార్డ్స్ నందు నమోదు చేయాలని. ఆంధ్ర రాష్ట్రంలో సరిహద్దు కలిగి ఉన్నందున సిబ్బంది అత్యంత అప్రమత్తంగా పనిచేయాలని సరిహద్దు వెంట నిగా ఉంచాలని ఆదేశించారు.