**దసరా పండుగకు ఊరికి వెళ్లే ప్రజలకు దొంగతనాల నివారణ గురించి""కోదాడ పట్టణ పోలీసు వారి విజ్ఞప్తి*

దసరా పండగకు ఊరికి వెళ్ళే ప్రజలకు దొంగతనాల నివారణ గురించి
కోదాడ టౌన్ పోలీస్
తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ళ****కోదాడ పట్టణ పోలీస్ వారి విజ్ఞప్తి
మీరు ఊరికి వెళ్ళే సమయంలో వీలైనంత మేరకు ఇంటిలో విలువైన వస్తువులు, నగదు మరియు బంగార ఆభరణాలు పెట్టకండి వాటిని బ్యాంకు లాకర్లో లేదా భద్రంగా ఉన్న చోట దాచుకోవడం ఉత్తమం.
బీరువా తాళం చెవులు బీరువా పైన కానీ, బట్టల క్రిందకానీ, ఇంట్లో కానీ పెట్టి వెళ్లవద్దు. అలాగే విలువై వాహనాల తాళం చెవులు కూడా వెంట తీసుకుని వెళ్తే మంచిది.
* ఇంటి ముందు తలుపులకు సెంటర్ లాక్ వేసి బయట గొల్లం పెట్టకండి.
ఇళ్లకు నాసిరకం తాళాలు వాడొద్దు, తాళం కనపడకుండా కర్టెన్స్ వేయాలి.
= ఇంటి తలుపుల ముందు చెప్పులు ఉంచండి.
బయట గేటుకు లోపల నుంచి తాళం వేయండి.
ఇంట్లో ముందు గదిలో లైట్ వేసి ఉంచండి.
పేపర్ బాయ్ మరియు పాలు వేసే వాళ్లకు రావద్దని చెప్పండి.
మీరు ఊరికి వెళ్ళేటప్పుడు మీకు నమ్మకమైన వారికి అలాగే స్థానిక పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వండి.
ఊరికి వెళ్ళిన తర్వాత కూడా ఇంటి పక్క వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటూ ఉండాలి.
బయటకు వెళ్లేటప్పుడు, వాకిట్లో ముగ్గులు వేసేటప్పుడు మెడలోని బంగారు ఆభరణాలు జాగ్రత్త. వీలైతే చీర కొంగుతో కవర్ చేసుకుంటే మంచిది