శెట్టి అగ్రహారం లో అంగన్ వాడి కేంద్రం ఏర్పాటు చెయ్యాలి.
వెంకటేష్ NSUI జిల్లా అధ్యక్షులు
గద్వాల శాసన సభ్యులు బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేసిన వెంకటేష్
జోగులాంబ గద్వాల 18 జూలై 2024 తెలంగాణవార్త ప్రతినిధి.
గద్వాల మండలం , చెనుగొనిపల్లి గ్రామ పరిధిలో ,ఆమ్లెట్ గ్రామమైన శెట్టి అగ్రహారం లో దాదాపు 400నుండి 500 మధ్య జనాభా ఉన్నది.అట్టి గ్రామము చేనుగొనిపల్లి గ్రామానికి దాదాపు1.5 కి.మి దూరంలో ఉన్నది.అట్టి గ్రామంలో చిన్న పిల్లలు,గర్భిణి స్త్రీలు మరియు కిశోర బాలికలకు ప్రభుత్వం తరపున అందించే పోషక పదార్థాలు మరియు పిండి పదార్థాలు సరిగ్గా అందడం లేదు ,వారు చెనుగొనిపల్లి గ్రామానికి వచ్చి తీసుకునే సదుపాయం మరియు రవాణా లేనందున వారు ఇబ్బందులకు గురి అవుతున్నారు అని వెంకటేష్ అన్నారు.
సరైన పోష్టిక ఆహారం లేక అనారోగ్యానికి గురి అవుతున్నారు .చెనుగొనిపల్లి గ్రామంలో 2 కేంద్రాలు ఉన్నాయి ,కావున శెట్టి అగ్రహారం లో కూడా మరో అంగన్ వాడీ కేంద్రం ను ఏర్పాటు చేసి వారికి సకాలంలో పౌష్టిక ఆహారం ను అందించేందుకు కృషి చెయ్యాలని ఎమ్మెల్యేను వారు కోరారు.